కమర్షియల్ సినిమాలపై నాని కామెంట్.. వెంకటేష్ మహా చేసిన వ్యాఖ్యలకు ఊహించని కౌంటర్!

కొన్ని సినిమాలు సక్సెస్ అయినా కూడా వాటిపై ఏదో ఒక విధంగా నెగిటివ్ కామెంట్స్ అయితే వస్తూనే ఉంటాయి. అయితే ఇటీవల కమర్షియల్ సినిమాలపై కొందరు చేస్తున్న వ్యాఖ్యలు తీవ్రస్థాయిలో వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా C/o కంచరపాలెం దర్శకుడు వెంకటేష్ మహా చేసిన వ్యాఖ్యలు కూడా అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించాయి. అయితే హీరో నాని కమర్షియల్ సినిమాల గురించి మాట్లాడిన విధానం ఇప్పుడు వైరల్ గా మారుతుంది. ఒక విధంగా అతని మాటలకు కౌంటర్ ఇచ్చినట్లు కూడా సోషల్ మీడియాలో టాక్ మొదలయ్యింది. అసలు ఇంతకు నాని ఏమన్నాడు అనే వివరాల్లోకి వెళితే..

అలాంటి కామెంట్ చేయడంతో..

అలాంటి కామెంట్ చేయడంతో..

ఇటీవల కేరాఫ్ కంచరపాలెం దర్శకుడు వెంకటేష్ మహా కెజిఎఫ్ సినిమాపై పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో హీరో తల్లి చెప్పినట్లుగా చేసిన విధానం ఏమాత్రం కరెక్ట్ కాదు అని నీచ్ కమిన్ కుత్తే అంటూ అతను ఘాటుగా స్పందించడం ఓ వర్గం వారిని ఎంతగానో ఆగ్రహాన్ని తెప్పించింది.

క్షమాపణ చెప్పినప్పటికీ..

క్షమాపణ చెప్పినప్పటికీ..

కేజిఎఫ్ పేరు ఎత్తకపోయినప్పటికీ కూడా దర్శకుడు చెప్పిన విధానాన్ని బట్టి అభిమానులతో పాటు చాలామంది కేజీఎఫ్ ఫ్యాన్స్ కూడా అతనిపై తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. అయితే ఆ తర్వాత వెంటనే వెంకటేష్ మహా క్షమాపణలు చెబుతూ మరో వీడియో కూడా విడుదల చేశాడు. అయితే నేను చెప్పిన విధానం తప్పే ఉండవచ్చు కానీ చెప్పాలని అనుకున్న మాట మాత్రం వెనక్కి తీసుకోవడం లేదు అని వివరణ ఇచ్చాడు.

హేళన చేస్తున్నట్లుగా నవ్వడంతో

హేళన చేస్తున్నట్లుగా నవ్వడంతో

కేవలం చెప్పిన విధానంలో కాస్త ఘాటుగా మాట్లాడినట్లుగా అనిపించింది అని అందుకు మాత్రమే క్షమాపణలు చెబుతున్నాను అన్నట్లుగా వెంకటేష్ స్పందించడంతో మళ్ళీ ఫాన్స్ ఊహించని విధంగా సీరియస్ అయ్యారు. అయితే వెంకటేష్ తోపాటు అతని ఇంటర్వ్యూలో పాల్గొన్న మిగతా దర్శకులు కూడా హేళన చేస్తున్నట్లుగా నవ్వడంతో వారిపై కూడా ఫ్యాన్స్ సీరియస్ అయ్యారు. అయితే వెంటనే వారు కూడా క్షమాపణలు కోరుతూ రియాక్ట్ అయ్యారు.

ఏ మాత్రం కరెక్ట్ కాదు

ఏ మాత్రం కరెక్ట్ కాదు

కమర్షియల్ సినిమాలను చాలా చిన్న చూపు చూడడం అనేది ఎంత మాత్రం కరెక్ట్ కాదు అని ఒక సినిమా సక్సెస్ అయింది అంటే దాని వెనకాల ఒక దర్శకుడు మేకింగ్ విధానం అలాగే ఎంతో మంది కష్టం కూడా దాగి ఉంటుంది అని చాలామంది చెబుతూ ఉంటారు. అయితే సినిమా ఇండస్ట్రీకి చెందిన వారే అంత పెద్ద సినిమాపై ఆ విధంగా కామెంట్ చేయడం అనేది ఏ మాత్రం కరెక్ట్ కాదు అని కూడా అన్నారు.

నాని కామెంట్స్

నాని కామెంట్స్

ఇక హీరో నాని దసరా సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉండగా ఊహించని విధంగా కమర్షియల్ సినిమాలు ఎంత ముఖ్యమో అనే విషయం గురించి ఆయన చెప్పారు. సినిమా ఇండస్ట్రీకి అత్యధిక బిజినెస్ చేసేది ఎక్కువగా కమర్షియల్ సినిమాలే అంటూ అవి లేకపోతే చిన్న సినిమాలు మంచి సినిమాలు ఏ మాత్రం ఉండవు అని ఇక జనాలు థియేటర్లకు రావాలన్నా కూడా అది కమర్షియల్ సినిమాల వల్లనే సాధ్యమవుతుంది అని నాని చెప్పాడు.

 పర్ఫెక్ట్ కౌంటర్

పర్ఫెక్ట్ కౌంటర్

ఇక నాని చేసిన కామెంట్స్ వెంకటేష్ మహా చేసిన కామెంట్స్ కు కౌంటర్ గానే ఉండడంతో ఇప్పుడు ఆ రెండు వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా చేస్తున్నారు. నాని ప్రత్యక్షంగా వెంకటేష్ చేసిన వ్యాఖ్యలపై స్పందించకపోయినప్పటికీ కూడా అతను చేసిన వ్యాఖ్యలు మాత్రం పర్ఫెక్ట్ కౌంటర్ అని మరి కొందరు కామెంట్ చేస్తున్నారు. మరి భవిష్యత్తులో వెంకటేష్ మహా ఏ విధంగా రియాక్ట్ అవుతాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X