హీరో నాని పెళ్లి ముహూర్థం ఖరారు!
ఓ ఆంగ్లపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాని మాట్లాడుతూ...నవంబర్లో గ్రాండ్‌గా పెళ్లి జరుగుతుందని, త్వరలోనే డేట్ ప్రకటిస్తానని చెప్పారు. ఎంగేజ్‌మెంట్ వివరాలు ముందుగా ప్రకటించక పోవడానికి పెద్ద కారణమేమీ లేదని, కావాలనే ఈ కార్యక్రమాన్ని సింపుల్‌గా ముగించినట్లు చెప్పుకొచ్చారు.
అదే విధంగా అంజన తనకు ఫేస్ బుక్ ద్వారా పరిచమైందనే వార్తల్లో నిజం లేదన్నారు. కామన్ ఫ్రెండ్ ద్వారా 5సంవత్సరాల క్రితం వైజాగ్‍లో కలిసామని... అప్పటి నుంచి తమ మధ్య పరిచయం ఉందని తెలిపారు. ఆ కామన్ ఫ్రెండ్ ఎవరు? అని అడగ్గా అతనో రేడియో జాకీ(ఆర్‌జె), సినిమా రంగంతో పరిచయం లేని వ్యక్తి అని స్పష్టం చేశారు.
నాని ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్నాడు. సముద్రఖని దర్శకత్వంలో జెండాపై కపిరాజు, గౌతం మీనన్ దర్శకత్వంలో ఎటో వెళ్లి పోయింది మనసు, కృష్ణ వంశీ దర్శకత్వంలో మరో చిత్రం చేస్తున్నారు. సముద్రఖని దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం షూటింగ్ త్వరలో గోవాలో జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications












