తాగి..వాగి అరెస్టయిన...హీరో నవదీప్
చందమామ, ఆర్య2 వంటి చిత్రాల ద్వారా పాపులర్ అయిన సినీహీరో నవదీప్ మద్యం తాగి కారు డ్రైవ్ చేస్తూ పోలీసులకు దొరికిపోయాడు. పోలీసులకు పట్టుబడ్డ తర్వాత పోలీసులను బండ బూతులు తిట్టడం ప్రారంభించారు. శనివారం రాత్రి రెండు గంటల సమయంలో బంజారాహిల్స్ ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి సమీపంలో వాహన తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు రాంగ్ రూట్ లో వచ్చిన కారు ఆపమన్నప్పటికీ ఆపకుండా వెళ్లిపోయింది. దీంతో పోలీసుల కారును వెంటాడి పట్టుకున్నారు. కారు డ్రైవ్ చేసిన హీరో నవదీప్ ను ఆటోలో ఎక్కించి పోలీసు స్టేషన్ కు తరలించేందుకు ప్రయత్నంచేశారు. అయితే నవదీప్ ఆటోడ్రైవర్ పై దౌర్జన్యం చేశాడు. పోలీసు టోపీని ముఖానికి అడ్డుపెట్టుకొని మీడియాకు కనిపించకుండా వుండేందుకు ప్రయత్నం చేశాడు. అలాగే పోలీస్ క్యాప్ ని రోడ్ మీదకి విసురుతూ, తిడుతూ హంగామా చేసారు. మీడియాను కూడా నానా రకాలుగా తిట్టారు. చివరకు పోలీసులు అతన్ని బంజారాహిల్స్ పోలీసుస్టేషన్ కు తరలించి అనంతరం వైద్యపరీక్షల నిమిత్తం గాంధీ హాస్పటిల్ కి తీసుకువెళ్లారు. ఈ ప్రాసెస్ అంతా జరగటానికి మూడు గంటలు పైగా పట్టింది. ఇక ఇతనిపై తప్ప త్రాగి డ్రైవ్ చేయటం, పోలీస్ అధికారి డ్యూటీలకు అడ్డుపడటం వంటి పలురకాల కేసులు పోలీసులు నమోదు చేయాలనీ యోచిస్తున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











