twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ పాటతో ఇవాంకాకి లింక్ పెట్టిన నవదీప్: కామెడీ సెటైర్ పిచ్చ వైరల్ అవుతోంది

    |

    సినీన‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టిస్తోన్న 'అజ్ఞాత‌వాసి' సినిమాలోని 'బ‌య‌టికొచ్చి చూస్తే' పాట‌ను న‌టుడు న‌వ‌దీప్ త‌న బాధ‌ను చెప్పుకోవ‌డానికి ఉప‌యోగించుకున్నాడు. హైద‌రాబాద్‌లో జ‌రుగుతోన్న జీఈఎస్‌కు ఇవాంక ట్రంప్ హాజ‌రైన విష‌యం తెలిసిందే. ఆమె హైదరాబాద్‎లోని హైటెక్స్‎లో జరిగే ప్రపంచ పారిశ్రామిక సదస్సులో ఇవాంక పాల్గొననుండటంతో.. హైదరాబాద్ అంతా సందడి వాతావరణం నెలకొంది. ఈ రోజు ఉదయం ఇవాంక రాక సందర్బంగా ఎక్కడ చూసినా ట్రాఫిక్ జాములే కనిపించాయి.

    ఇవాంకా

    ఇవాంకా

    ఇవాంకా ప‌ర్య‌టించే ప్రాంతాల‌లో తెలంగాణ స‌ర్కార్‌ క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేసింది. ఆమె ప‌ర్య‌టించే రూట్ల‌లో భారీగా ట్రాఫిక్ జాం కూడా అయింది. ఈ ట్రాఫిక్ జాం వ‌ల్ల సామాన్యుల‌తో పాటు ఓ సెల‌బ్రిటీ కూడా ఇబ్బంది ప‌డ్డాడు.

    పాపుల‌ర్ పాట రూపంలో

    పాపుల‌ర్ పాట రూపంలో

    అయితే, ఆ సెల‌బ్రిటీ....ట్రాఫిక్ జాంపై, ఇవాంకా ప‌ర్య‌ట‌న‌పై త‌న అభిప్రాయాన్ని వ్యంగ్యాత్మ‌కంగా ఓ పాపుల‌ర్ పాట రూపంలో ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. ఆ పాపుల‌ర్ పాట‌కు సెటైర్ తోడ‌వ‌డంతో ఆ పోస్ట్‌ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.

    ఉదయం 10 గంటలకు

    ఉదయం 10 గంటలకు

    ఇవాంక ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా హైదరాబాద్‌లో ఉదయం 10 గంటలకు భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ఇంటికి వెళ్తున్న యంగ్ హీరో నవదీప్ ఈ ట్రాఫిక్ లో చిక్కుకున్నాడ‌ట‌. దీంతో, త‌న ట్రాఫిక్ లో ఇరుక్కున్న న‌వ‌దీప్ త‌న అస‌హ‌నాన‌న్ని ఓ సెటైరిక‌ల్ పోస్ట్ రూపంలో వ్య‌క్త‌ప‌రిచాడు.

     ఇవాంక రోడ్డు బ్లాక్‌

    ఇవాంక రోడ్డు బ్లాక్‌

    ‘బయటికెళ్లి చూస్తే టైమేమో 10'0 క్లాక్‌. ఇంటికెళ్లే రోడ్డు మొత్తం ఇవాంక రోడ్డు బ్లాక్‌' అని సరదాగా త‌న ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఇప్పటికే నెట్ లో పాపులర్ అయిన ఈ పాటని నవదీప్ ఇలా వాడేయ్యటం అందరికీ నచ్చేసింది అంతే ఇక క్షణాల్లో వైరల్ అయిపోయిందా పోస్టు .

    ఇవాంకను ఉద్దేశిస్తూ

    ఇవాంకను ఉద్దేశిస్తూ

    ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌, త్రివిక్ర‌మ్ కాంబోలో రాబోతోన్న `అజ్ఞాత‌వాసి` చిత్రంలోని ‘బయటికెళ్లి చూస్తే టైమేమో 3'0 క్లాక్‌'పాట బాగా పాపుల‌ర్ అయిన సంగ‌తి తెలిసిందే. అందుకే ఇవాంకను ఉద్దేశిస్తూ ఇలా సరదాగా పోస్ట్ చేశాడు న‌వ‌దీప్. ఏది ఏమైనా ఇవాంకాపై న‌వ‌దీప్ చేసిన పోస్ట్‌ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.

    English summary
    "Baitikelli chusthe time emo 10 o clock, Intikelle road mothham ivanka road block !! #haha :)" Tweeted Hero Navadeep
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X