డ్రగ్స్‌ కేసులో నన్ను ఎందుకు పిలిచారంటే? ఈడీ విచారణపై హీరో నవదీప్ క్లారిటీ!

డ్రగ్స్ కేసులో హీరో నవదీప్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టోరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేయడం తెలుగు సినిమా పరిశ్రమలో సంచలనంగా మారింది. అక్టోబర్ 10వ తేదీన ఆయన ఈడీ అధికారుల విచారణకు హాజరయ్యారు. అయితే తాజాగా ఈడీ విచారణకు హాజరైన విషయం గురించి మీడియాకు క్లారిటీ ఇచ్చారు. నవదీప్ సమర్శించిన సకిలేటి కథ సినిమా రిలీజ్ నేపథ్యంలో ప్రదర్శించిన ప్రీమియర్ షో సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ..

ఈడీ అధికారులు నోటీసులు జారీ చేయడంతో విచారణకు హాజరయ్యాను. గతంలో పాత కేసు విచారణ సందర్బంగా తీసుకొన్న సమాధానాలను మళ్లీ అడిగి తెలుసుకొన్నారు. తాజాగా నైజీరియన్ పట్టుబడిన సందర్భంగా నా పేరు బయటకు రావడంతో మళ్లీ పిలిచారు. దాంతో విచారణకు హాజరయ్యాను. ఈ విచారణలో గతంలో వేసిన ప్రశ్నలే మళ్లీ వేశారు. వాటికి నేను ఎలాంటి సమాధానాలు చెప్పాలో అవి చెప్పాను అని నవదీప్ అన్నారు.

Hero Navdeep given Clarity on Enforcement Directorate investigation in Drugs Case 2023

డ్రగ్స్ సప్లయర్స్‌తో ఉన్న సంబంధాల గురించి ఆరా తీశారు. ఆ ప్రశ్నలకు నేను తగిన జవాబులు చెప్పాను. అయితే మళ్లీ విచారణకు రమ్మనమని చెప్పలేదు. ఒకవేళ పిలుస్తే వెళ్లడానికి నాకు అభ్యంతరం లేదు అని నవదీప్ అన్నారు. విచారణ ప్రక్రియ కొనసాగుతున్నది. 2017లో సిట్ విచారణకు హాజరయ్యాను. 2020లో ఈడీ విచారణకు పిలిస్తే వెళ్లాను. ఇప్పుడు కూడా ఈడీ పిలిస్తే వెళ్లి వచ్చాను అని నవదీప్ చెప్పారు.

Hero Navdeep given Clarity on Enforcement Directorate investigation in Drugs Case 2023

సిట్ విచారణ సందర్భంగా అడిగిన ప్రశ్నలకు అనుబంధంగా ఈడీ ప్రశ్నలు సంధించారు. కేవలం ఒక విచారణ మాత్రమే. ఇందులో భయపడాల్సిన అవసరం లేదు అని నవదీప్ చెప్పారు.

ఇదిలా ఉండగా, షేడ్స్ ఎంటర్‌టైన్‌మెంట్, సీ స్పేస్, అశోక్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించిన సకిలిటి కథ సినిమాను హీరో నవదీప్ సమర్పించారు. ఈ సినిమాకు రాజశేఖర్ సుడ్మూన్ దర్శకత్వం వహించగా, అశోక్ మిట్టపల్లి, దేవీ ప్రసాద్ బలివాడ నిర్మించారు. ఈ సినిమా అక్టోబర్ 13వ తేదీన రిలీజ్ అవుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X