జూ. ఎన్టీఆర్‌కు కృతజ్ఞతలు చెప్పాలి.. ఏం చేయాలో తెలియని స్థితిలో నా కెరీర్‌ని ట్రాక్‌లో పెట్టారు!

Recommended Video

Naveen Chandra New Movie Opening || Filmibeat Telugu

అందాల రాక్షసి చిత్రంతో యువ హీరో నవీన్ చంద్ర నటుడిగా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ఆ చిత్రంలో ఎమోషనల్ పెర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత నవీన్ చంద్రకు హీరోగా సరైన సక్సెస్ లభించలేదు. అందాల రాక్షసి తర్వాత నవీన్ చంద్ర లచ్చిందేవికి ఓ లెక్కుంది, త్రిపుర, నా రాకుమారుడు లాంటి చిత్రాల్లో నటించాడు. ఆ చిత్రాలు నిరాశపరిచాయి. అవకాశాలు తగ్గుతున్న సమయంలో అరవింద సమేతలో విలన్ గా నటించి మెప్పించాడు.

విలన్ పాత్రలో

విలన్ పాత్రలో

రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన అరవింద సమేత చిత్రంలో నవీన్ చంద్ర నెగిటివ్ రోల్ ప్లే చేశాడు నవీన్ చంద్ర నటించిన బాలిరెడ్డి పాత్రకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా నవీన్ చంద్ర కొత్త చిత్రం ప్రారంభమైంది. వేణు మధుకంటి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో నవీన్ చంద్ర హీరోగా నటిస్తున్నాడు. రాజకీయ నేపథ్యంలో ఈ చిత్రం ఉండనుంది.

 జూ. ఎన్టీఆర్‌కి కృతజ్ఞతలు

జూ. ఎన్టీఆర్‌కి కృతజ్ఞతలు

తన కొత్త సినిమా లాంచింగ్ సందర్భంగా నవీన్ చంద్ర మీడియాతో మాట్లాడారు. తాను త్రివిక్రమ్ శ్రీనివాస్, ఎన్టీఆర్ లకు కృతజ్ఞతలు చెప్పాలని నవీన్ చంద్ర అన్నారు. నా కెరీర్ ట్రాక్ తప్పిన సమయంలో ఏం చేయాలని ఆలోచనలో పడ్డాను. అలాంటి తరుణంలో త్రివిక్రమ్, ఎన్టీఆర్ నన్ను అరవింద సమేత చిత్రంలో బల్;బాలిరెడ్డిగా నటింపజేశారు. ఆ పాత్ర వలన తాను మరింతగా ప్రేక్షకులకు చేరువకాగలిగానని నవీన్ చంద్ర తెలిపారు. బాలిరెడ్డి పాత్ర అందరికి నచ్చిందని నవీన్ చంద్ర తెలిపారు.

 కొత్తగా కనిపిస్తా

కొత్తగా కనిపిస్తా

ఇక తన కొత్త సినిమా విశేషాలు చెబుతూ.. నన్ను మీరంతా ఈ చిత్రంలో కొత్తగా చూస్తారని నవీన్ చంద్ర తెలిపాడు. తాను చేసే తదుపరి చిత్రం ప్రేక్షకులకుమంచి అనుభూతి ఇవ్వాలని ఈ చిత్ర కథపై తాను, దర్శకుడు ఏడాది పాటు కృషి చేశామని నవీన్ చంద్ర తెలిపాడు. ఈ చిత్రానికి ఓ టైటిల్ అనుకుంటున్నామని, త్వరలో ప్రకటిస్తామని నవీన్ చంద్ర తెలిపారు.

కీలక పాత్రలో

కీలక పాత్రలో

ఈ చిత్రంలో కీలక పాత్రల కోసం సీనియర్ నటులు కోట శ్రీనివాస రావు, నాజర్ లని ఎంపిక చేసుకున్నట్లు తెలిపారు. సుబ్బరాజు, బ్రహ్మాజీ, అవసరాల శ్రీనివాస్ కూడా నటిస్తున్నారు. ఈ చిత్రం తన కెరీర్ కు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని నవీన్ చంద్ర భావిస్తున్నారు. యశాస్ సినిమాస్ బ్యానర్ పై మంజునాథన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X