హీరో నవీన్ పోలిశెట్టికి యాక్సిడెంట్: విరిగిపోయిన చేయి.. డాక్టర్లు ఏం చెప్పారంటే!
ఏమాత్రం బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి ప్రవేశించి.. చాలా తక్కువ సమయంలోనే తనలోని టాలెంట్‌ను నిరూపించుకుని.. విశేషమైన గుర్తింపును అందుకున్నాడు యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి. అద్భుతమైన టైమింగ్‌తో పాటు అదిరిపోయే యాక్టింగ్‌తో సత్తా చాటిన అతడు.. వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ దూసుకుపోతోన్నాడు. ఈ ఊపులోనే మరిన్ని మూవీలు చేస్తున్నాడు. ఈ పరిస్థితుల్లో తాజాగా నవీన్ పోలిశెట్టి రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అసలేం జరిగింది? ఇప్పుడెలా ఉన్నాడు? దానికి సంబంధించిన పూర్తి వివరాలను మీరే చూసేయండి!
అమెరికాలో రోడ్డు ప్రమాదం:హీరో నవీన్ పోలిశెట్టి కొద్ది రోజుల క్రితమే అమెరికాకు వెళ్లాడు. అక్కడ ఫ్రెండ్స్ అండ్ బంధువులతో ఉంటున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో తాజాగా అతడికి యూఎస్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌పై వెళ్తుండగా అతడు జారి కింద పడిపోయాడట. దీంతో నవీన్ పోలిశెట్టికి గాయాలు అయినట్లు చెప్తున్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే అతడని ఆస్పత్రికి తరలించారు.

రెండు రోజుల క్రితమే అని:నవీన్ పోలిశెట్టికి అమెరికాలో రోడ్డు ప్రమాదం జరిగి రెండు రోజుల కూడా అయిపోయిందట. ఈ విషయం ఇక్కడి వాళ్లకు తెలియకుండా జాగ్రత్త పడినట్లు తెలిసింది. అయితే, హైదరాబాద్‌లోని తన టీమ్ సభ్యులకు అతడి నుంచి సమాచారం వచ్చిందని అంటున్నారు. ఇలా ఇప్పుడు ఈ న్యూస్ బయటకు వచ్చింది. దీంతో నవీన్ పోలిశెట్టి ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
నవీన్ గాయాలు గట్టిగానే:రోడ్డు ప్రమాదానికి గురైన నవీన్ పోలిశెట్టికి ఒక చేయి విరిగినట్లు తాజాగా న్యూస్ వైరల్ అవుతోంది. అంతేకాదు, అతడికి మరిన్ని గాయలు కూడా అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటున్నాడని తెలుస్తోంది. ఈ విషయం తెలియగానే అతడి కుటుంబ సభ్యులు అమెరికాకు పయనం అయ్యారని కూడా ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది.

డాక్టర్లు ఏం చెప్పారంటే:అమెరికాలో బైక్ యాక్సిడెంట్‌కు గురైన నవీన్ పోలిశెట్టికి వైద్యం చేసిన డాక్టర్లు అతడిని దాదాపు రెండు నెలలకు పైగానే విశ్రాంతి తీసుకోవాలని చెప్పినట్లు తెలిసింది. చేయి విరగడం వల్లే వాళ్లు ఈ విధమైన జాగ్రత్తను తీసుకోవాలని సూచించినట్లు సమాచారం. అంటే.. దగ్గర దగ్గర మరో మూడు నెలల వరకూ నవీన్ పోలిశెట్టి షూటింగ్‌లలో పాల్గొనే అవకాశం ఉండదనే చెప్పాలి.
ఇప్పుడు ఆ సినిమాలతో:నవీన్ పోలిశెట్టి ఈ మధ్య కాలంలో వరుసగా హిట్లను కొడుతూ ఫుల్ ఫామ్‌తో దూసుకుపోతోన్నాడు. ఈ ఉత్సాహంతోనే ఇప్పటికే 'అనగనగ ఒక రాజు' అనే సినిమాను లైన్‌లో పెట్టుకున్నాడు. దీనితో పాటు టాలీవుడ్‌లోని రెండు బడా ప్రొడక్షన్ హౌస్‌లతో ప్రాజెక్టులు చేయబోతున్నాడు. అలాగే, బాలీవుడ్ రామాయణానికి కూడా ఎంపిక అయ్యాడనే టాక్ వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











