twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చెప్తే నమ్మరు కానీ.. నాకు కూతురు పుడితే, కాలేజీ రోజుల్లో పోలీస్ స్టేషన్ దాకా?: నిఖిల్

    |

    కెరీర్‌లో వరుస ఫ్లాపుల తర్వాత 'స్వామి రారా' సినిమాతో అనూహ్యంగా హిట్ ట్రాక్ ఎక్కాడు హీరో నిఖిల్. అప్పటిదాకా చేసిన మూస కథల నుంచి బయటకొచ్చి.. పూర్తి స్థాయి వైవిధ్యమున్న కథలను ఎంచుకోవడమే అతని సక్సెస్ సీక్రెట్.

    స్వామి రారా నుంచి అదే ట్రెండ్ కొనసాగిస్తున్న నిఖిల్.. తాజా సినిమా 'కిరాక్ పార్టీ'తోనూ హిట్ కొడుతానన్న ధీమాతో ఉన్నాడు. శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా నిఖిల్ పలు ఆసక్తికర విషయాలు మీడియాతో పంచుకున్నాడు.

     కిరాక్ పార్టీలో నిఖిల్ పాత్ర?:

    కిరాక్ పార్టీలో నిఖిల్ పాత్ర?:

    కథానుగుణంగా కాలేజ్ బ్యాక్ డ్రాప్‌లో నడిచే సినిమా ఇది. మొదట్లో ఓ సాదాసీదా బీటెక్ విద్యార్థిలా.. క్రమంగా విద్యార్థి నాయకుడిగా ఎదిగే పాత్రలో కనిపిస్తా. మధ్యలో ప్రేమలు, బ్రేకప్స్‌, గొడవలు, వగైరా ఉంటాయి. సినిమా మొత్తంలో రెండు రకాల పాత్రల్లో కనిపిస్తా. ఫస్టాఫ్‌లో మామూలు లుక్‌లో, సెకండాఫ్‌లో గడ్డంతో రఫ్ లుక్‌లో కనిపిస్తా.

     ఆ ఫీవర్ పోదేమో..:

    ఆ ఫీవర్ పోదేమో..:

    సినిమాపై ఎంత నమ్మకమున్నా సరే.. రిలీజ్ దగ్గర పడుతోందంటే ఒకలాంటి టెన్షన్. ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారోనన్న ఉత్కంఠ ఉంటుంది. నా తొలి సినిమా హ్యాపీ డేస్ నుంచి ఇప్పటిదాకా ప్రతీ సినిమా విడుదలకు ముందు ఉత్కంఠగానే ఎదురుచూస్తా. ఇప్పటికీ 15సినిమాలు చేశా.. ఇంకో 30 చేసినా ఈ ఫీవర్ పోదేమో!

    పోలీస్‌ స్టేషన్‌దాకా వెళ్లిన అనుభవాలు!..

    పోలీస్‌ స్టేషన్‌దాకా వెళ్లిన అనుభవాలు!..

    కాలేజ్ రోజుల్లో ఒకట్రెండు సందర్భాల్లో గొడవల్లో ఇరుక్కుని, పోలీస్‌ స్టేషన్‌దాకా వెళ్లిన అనుభవాలున్నాయి. కాలేజ్ స్టూడెంట్స్ అని పోలీసులే దయతలిస్తే ఇంటికొచ్చిన సందర్భాలవి. సో.. సినిమా చూస్తే కుర్రాళ్లకి కాలేజీ రోజులు గుర్తొస్తాయి.

    అమ్మాయిలను చులకనగా చూడటం.. వాళ్లను అనరాని మాటలు అంటే ఎంతలా బాధపడుతారు.. చివరకు అవి ఎక్కడికి దారితీస్తాయి వంటి అంశాలను కూడా సినిమాలో చూపించాం. మొత్తంగా ఇదొక యూత్ ఫుల్ ఎంటర్టైనర్.

     అప్ కమింగ్ ప్రాజెక్ట్స్..:

    అప్ కమింగ్ ప్రాజెక్ట్స్..:

    ఈ ఏడాది రెండు సినిమాలు చేస్తున్నా. తమిళంలో హిట్టయిన ‘కణిదన్‌' చిత్రాన్ని ఠాగూర్‌ మధు తెలుగులో రీమేక్ చేస్తున్నారు. అందులో నేనే హీరో. తమిళ కుర్రాడే దర్శకత్వం చేయనున్నాడు. ఇక 'కార్తీకేయ'కి సీక్వెల్ రూపంలో మరో సినిమా పట్టాలెక్కనుంది. కార్తీకేయ ఎక్కడైతే ఎండ్ అయిందో.. ఆ పాయింట్ నుంచి సీక్వెల్ మొదలవుతుంది. వీటితో పాటు మరో రెండు సినిమాలు కూడా ఒప్పుకున్నాను.

     మరి పెళ్లెప్పుడు?:

    మరి పెళ్లెప్పుడు?:

    కెరీర్ ఇంత బాగా సాగుతున్న సమయంలో పెళ్లి చేసుకోవడం సరైందేనా అని ఆలోచిస్తున్నా. ఇంట్లో అమ్మా నాన్న కూడా తొందరపెడుతున్నారు. నాకూ చేసుకోవాలనే ఉంది. చూద్దాం.. టైమ్ వస్తే ఏది ఆగదు కదా!..

     కూతురు పుడితే 'మాయ'..:

    కూతురు పుడితే 'మాయ'..:

    అలా ఏం కాదు.. పెళ్లి చేసుకోవాలని, త్వరగా పిల్లలను కనేసి వారిని ఎత్తుకుని ముద్దాడాలని నాకూ ఉంది. చెప్తే నవ్వుతారేమో కానీ.. నాకు కూతురు పెడితే ఏ పేరు పెట్టాలో కూడా ఎప్పుడో నిర్ణయించేశా. మా పాపకి 'మాయ' అని పేరు పెడుతా.

    English summary
    On the eve of releasing Kirrak Party movie, Hero Nikhil shared some interesting news to media about the journey of movie
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X