నిఖిల్‌కు కోర్టు శిక్ష - అనుభవిస్తానని చెప్పిన హీరో

By Bojja Kumar

మద్యం సేవించి డ్రైవింగ్ చేసిన కేసులో టాలీవుడ్ యువ హీరో నిఖిల్ కు నాంపల్లి కోర్టు మంగళవారం శిక్ష విధించింది. సంవత్సం పాటు అతని డ్రైవింగ్ లైసెన్సును సస్పెండ్ చేయడంతో పాటు, రూ. 2600 జరిమానా విధించింది. కోర్టు తీర్పుపై నిఖిల్ స్పందిస్తూ....తాను తప్పు చేశానని, కోర్టు ఆదేశాలను శిరసా వహిస్తానని, సంవత్సరం పాటు డ్రైవింగ్ కు దూరంగా శిక్షను అనుభవిస్తానని తెలిపారు. యువతకు ఆదర్శంగా ఉండాల్సిన నేను ఇలా చేసినందుకు సిగ్గు పడుతున్నానని నిఖిల్ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ఇప్పటి నుంచి తాను మద్యం సేవించడం మానేస్తానని చెప్పిన నిఖిల్...యువతను మంచి మార్గంలో నడిపించే కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటానని, మద్యం మాన్పించేందుకు తన వంతు ప్రయత్నం, మద్యం సేవించి వాహనాలు నడపకుండా నిర్వహించే కార్యక్రమాల్లో ప్రచారం చేస్తానని చెప్పారు.

నగరంలో యాక్సిండెట్లు ఇటీవల ఎక్కువయ్యాయి. వీటిలో ఎక్కువగా మద్యం మత్తులో జరుగుతున్నవే అని గుర్తించిన పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ లో నిఖిల్ శుక్రవారం అర్థరాత్రి పట్టుబడ్డాడు. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని, కారును సీజ్ చేసి వదిలేశారు. కోర్టు ఆదేశాల మేరకు మెజిస్టేట్ ముందు హాజరయ్యారు నిఖిల్.

Read more about: nikhil నిఖిల్‌
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X