హీరో నిఖిల్ ఇంట తీవ్ర విషాదం.. మొన్ననే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్..అంతలోనే?
గత కొంతకాలంగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ఎట్టకేలకు కి అర్జున్ సురవరం సినిమాతో హిట్ అందుకున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న ఆయన ఇంట ఇప్పుడు తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే

హ్యాపీడేస్ తో ఎంట్రీ
శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ''హ్యాపీడేస్' చిత్రంతో వెండి తెరకు పరిచయమయ్యాడు నిఖిల్. మొదటి సినిమాతోనే ప్రేక్షకులకు దగ్గరయ్యాడు నిఖిల్. తర్వాత వరుస పరాజయాలు చవిచూశాడు. స్వామి రారా సినిమాతో ఆయన అతని కెరీర్ మరోసారి మలుపు తిరిగింది. కార్తికేయ, ఎక్కడికి పోతావ్ చిన్నవాడ, అర్జున్ సురవరం వంటి హిట్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

వరుస సినిమాలు
అయితే హీరో నిఖిల్ సిద్ధార్థ్ సరైన హిట్ అందుకొని చాలా కాలమే అయింది. చివరిగా ఎక్కడికి పోతావు చిన్నవాడా అనే సినిమాతో హిట్ అందుకున్న ఆయన ఆ తర్వాత కేశవ, కిరాక్ పార్టీ వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కానీ ఆకట్టుకోలేకపోయాడు. అయితే అర్జున్ సురవరం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ఒక మాదిరి హిట్ అందుకున్నాడు కానీ ఆయన ఎలాగైనా భారీ హిట్ కొట్టాలనే ఉద్దేశంతో కనిపిస్తున్నాడు.

సీక్వెల్ కూడా
ఈ క్రమంలో గతంలో సూపర్ హిట్ అయిన కార్తికేయ అనే సినిమాకు సీక్వెల్ గా కార్తికేయ 2 అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. అంతే కాక ఈ సినిమా కాకుండా కుమారి 21 ఎఫ్ సినిమా దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. డానికి 18 పేజెస్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. తాజాగా నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా కొత్త సినిమా అధికారికంగా ప్రకటించారు.

పాన్ ఇండియన్ మూవీ
ఎడిటర్ గ్యారీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి 'స్పై' అనే టైటిల్ ను ఖరారు చేయటంతోపాటు నిఖిల్ ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. 'స్పై'ని తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. అయితే తాజాగా హీరో నిఖిల్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నిఖిల్ తండ్రి కావలి శ్యామ్ సిద్ధార్థ్ ఏప్రిల్ 28వ తేదీ మధ్యాహ్నం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొంది ఇటీవలే ఆరోగ్యం మెరుగవడంతో డిశ్చార్జ్ అయ్యారు.

తీవ్ర విషాదం
ఆయన ఆరోగ్యం మళ్ళీ క్షీణించడంతో చివరి శ్వాస విడిచారు. శ్యామ్ గత్మలో ఆర్మీలో పని చేసి రిటైర్మెంట్ తర్వాత ఇంటి దగ్గరే ఉంటున్నారు. ఇక ఆయన మృతితో దీంతో నిఖిల్ ఫ్యామిలీలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఇక నిఖిల్ తండ్రి శ్యామ్ సిద్ధార్థ్ మరణవార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా నిఖిల్ కు ధైర్యం చెబుతూనే సంతాపం తెలుపుతున్నారు. నిఖిల్ కరోనా సమయంలోనే తాను ప్రేమించిన పల్లవి వర్మను వివాహం చేసుకున్నారు.


Click it and Unblock the Notifications











