ఎన్టీఆర్‌కి జరిగింది, విజయ్ దేవరకొండకు కూడా.. నాకు జరగదని గ్యారెంటీ ఏంటి.. నిఖిల్!
Recommended Video

యంగ్ హీరో నిఖిల్ ట్విట్టర్ లో పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారుతోంది. హీరో నిఖిల్.. విజయ్ దేవరకొండ టాక్సీవాలా చిత్రం గురించి స్పందించాడు. ప్రస్తుతం యూఎస్ లో ఉన్న నిఖిల్ ట్విట్టర్ లో ఓ వీడియో పోస్ట్ చేశాడు. నిఖిల్ చేసిన అప్పీల్ అందరిని ఆలోచింపజేసే విధంగా ఉంది. కొద్దిరోజుల క్రితం విజయ్ దేవరకొండ గురించి నిఖిల్ పరోక్షంగా చేసిన కామెంట్స్ కలకలం సృష్టించాయి. ఇంతకీ నిఖిల్ తాజాగా విజయ్ దేవరకొండ గురించి ఏం మాట్లాడాడో ఇప్పుడు చూద్దాం.

టాక్సీవాలా పైరసీ
ఇంకా విడుదల కూడా కానీ టాక్సీవాలా చిత్రానికి అప్పుడే పైరసీ బయటకు రావడం హాట్ టాపిక్ గా మారింది. ప్రీరిలీజ్ వేడుక నుంచి చిత్ర యూనిట్ మొత్తం పైరసీ విషయంలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయ్ దేవరకొండ అయితే తన శైలిలో ఘాటుగా స్పందించాడు. పైరసీ చేసేవాళ్లకు నా మిడిల్ ఫింగర్ చూపించాలని ఉందంటూ మాట్లాడాడు. పైరసీ వలన నిర్మాతలు దారుణంగా నష్టపోతున్న సంగతి తెలిసిందే.

ఎమోషనల్ పోస్ట్
టాక్సీవాలా చిత్ర సినిమాటోగ్రాఫర్ సుజిత్ సారంగ్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. టాక్సీవాలా చిత్ర షూటింగ్ సమయంలో తనకు గాయమైన ఫోటోలు షేర్ చేశాడు. గాయానికి వెనకాడకుండా ఈ చిత్రం కష్టపడ్డాం అని తెలిపాడు. కానీ సినిమా విడుదల సమయంలో పైరసీకి గురికావడం చాలా నిరాశకలిగించిందని ఆవేదన వ్యక్తం చేశాడు.

స్పందించిన నిఖిల్
సుజిత్ సారంగ్ పోస్ట్ గమనించిన నిఖిల్ ట్విట్టర్ వేదికగా స్పందించాడు. సోషల్ మీడియాలో టాక్సీవాలా సినిమాటోగ్రాఫర్ సుజిత్ పెట్టిన పోస్ట్ చూశాను. చాలా భాదగా అనిపించింది. టాక్సీవాలా చిత్ర దర్శకుడు రాహుల్ నాకు చాలా సన్నిహితుడు. వీళ్లంతా చాలా కష్టపడి చిత్రాన్ని తెరకెక్కించారు. అలాంటి చిత్రాన్ని పైరసీ చేస్తే అది గుండె పగిలే ఆవేదన కలిగిస్తుందని నిఖిల్ తెలిపాడు.
మొన్న ఎన్టీఆర్ సినిమా
ఇటీవల విడుదలైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ చిత్రం అరవింద సమేతని పైరసీ చేశారు. ఇప్పుడు టాక్సీవాలా చిత్రం పైరసీకి గురైంది. రేపు నా చిత్రానికి కూడా ఆ పరిస్థితి కలగవచ్చు. దయచేసి ఎవరూ పైరసీని ప్రోత్సహించవద్దు అని నిఖిల్ కోరాడు. త్వరలో నిఖిల్ ముద్ర చిత్రంతో ఆడియన్స్ ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.

విజయ్ దేవరకొండకు
టాక్సీవాలా చిత్రం బాగా ఆడాలని చిత్ర యూనిట్ కి, విజయ్ దేవరకొండకు, ప్రియాంకకు నా బెస్ట్ విషెష్ తెలియజేస్తున్నా అంటూ నిఖిల్ పేర్కొన్నాడు. ఈ చిత్ర ప్రొడ్యూసర్ ఎస్కెఎన్ ఎంత కష్టాపడతాడో తన కేశవ చిత్ర సమయంలో చూశానని నిఖిల్ పేర్కొన్నాడు. అందరూ పైరసీలో సినిమా చూడకుండా థియేటర్స్ లోనే చూడాలని కోరాడు.

ట్విట్టర్ వార్
ఆ మధ్యన విజయ్ దేవరకొండ గురించి సోషల్ మీడియాలో పరోక్షంగా పెట్టిన పోస్ట్ వివాదంగా మారిన సంగతి తెలిసిందే. దీనితో విజయ్, నిఖిల్ మధ్య విభేదాలు ఉన్నాయని అంతా భావించారు. తాజాగా టాక్సీవాలా పైరసీపై స్పందించిన నిఖిల్ ఆ వివాదానికి ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టాడు. టాక్సీవాలా చిత్రం నవంబర్ 17న విడుదలకు సిద్ధం అవుతోంది. నిఖిల్ ముద్ర చిత్రం డిసెంబర్ 28న విడుదల కానుంది


Click it and Unblock the Notifications











