twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విజయ్ దేవరకొండతో ఫైట్.. తోక ముడిచిన నిఖిల్.. పాపం నోరుజారి..

    |

    టాలీవుడ్‌లో యువ హీరోలు విజయ్ దేవరకొండ, నిఖిల్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతున్నది. నోటా రిలీజ్‌కు ముందు, తర్వాత జరిగిన ప్రమోషన్, తదితర సంఘటనలను ఉద్దేశించి విజయ దేవరకొండను టార్గెట్ చేస్తూ నిఖిల్ ట్వీట్ చేశాడు. 'ప్రపంచమంతా నా చుట్టూ తిరుగుతుందని భావించే వాళ్ల కోసం... అనవసరంగా లేని పోని యాటిట్యూడ్‌ చూపించే వాళ్ల కోసం... డ్యూడ్‌, నువ్వేమంత ఇంపార్టెంట్‌ కాదు. ప్రతి నటుడు తనతో తాను పోటీ పడతాడు. మనమంతా మూవీ మేకింగ్‌ అనే సముద్రంలో నీటిబొట్టు వంటి వాళ్లమే. వర్క్‌ మోర్‌ అని ట్వీట్‌లో నిఖిల్‌ పేర్కొన్నారు.

    Hero Nikhil taken step back after targeting Vijay Deverakonda

    నిఖిల్ ట్వీట్ చేసిన తర్వాత చాలా మంది అనేక సందేహాలను వ్యక్తం చేశారు. ఏంటి ఎవరిని ఉద్దేశించి ఈ ట్వీట్ చేశారని ఆరా తీశారు. తన ట్వీట్ వెనుక విజయ దేవరకొండ ఉన్నట్టు స్పష్టమైంది. ఇలా అనేక రకాలుగా ట్రోల్ జరుగుతున్న నేపథ్యంలో నిఖిల్ ఆ ట్వీట్‌ను డిలీట్ చేయడంతో సినీ వర్గాల్లో చర్చ మొదలైంది.

    Hero Nikhil taken step back after targeting Vijay Deverakonda

    నోటా ఫ్లాఫ్ అయిన నేపథ్యంలో ఇటీవల విజయ్ దేవరకొండ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. నోటా జాతీయ స్థాయిలో వచ్చిన రివ్యూలను సమీక్షించుకొంటున్నాను. నేను క్షమాపణలు కోరను. బాధ్యత తీసుకుంటా. నోటా సినిమా చేసినందుకు గర్వపడుతున్నా. నేను చెప్పాలనుకున్న కథ అది. తమిళనాడు, జాతీయ మీడియాకు చిత్రం నచ్చింది. అలాగే, చిత్రంపై వచ్చిన విమర్శల్ని సీరియస్‌గా తీసుకున్నా. నా నిర్ణయాల్ని విశ్లేషించి తప్పుల్ని సరిచేసుకున్నా. కాని యాటిట్యూడ్‌ మాత్రం మారదు. జయాపజయాలు ఓ రౌడీని తయారు చేయలేవు, తుంచలేవు. రౌడీగా ఉండటం అంటే గెలవడం మాత్రమే కాదు. గెలుపు కోసం పోరాటం చేయడం తప్ప మరేదీ లేదు అని విజయ్ దేవరకొండ ట్వీట్ చేశాడు.

    English summary
    Hero Nikhil taken step back after targeting Vijay Deverakonda indirectly. Nikhil tweeted pointed out attitude of somebody. After that treat everyone felt that he was targetted VijayD. Soon after, He deleted his tweet from social media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X