twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరో చెప్పిన దెయ్యం కథ.. భయంతో కాళ్లు, చేతులు ఆడలేదు..

    By Rajababu
    |

    నిరూప్ భండారి తన సోదరుడు అనూప్ భండారి దర్శకత్వంలో అత్యున్నత ప్రమాణాలతో అందమైన ప్రేమకథ గా తెరకెక్కుతున్న 'రాజరథం' చిత్రీకరణ సమయంలో ఎన్నో సరదా సంఘటనలు జరిగినట్టు చెప్పారు. 'రాజరథం' లోని 'కాలేజీ డేస్' సాంగ్ తనని తన కాలేజీ రోజుల్లోకి తీసుకెళ్ళిందని నిరూప్ అప్పటి సంఘటనని గుర్తు చేసుకున్నారు.

     మైసూరులోని పాడుబడిన ఇంట్లో..

    మైసూరులోని పాడుబడిన ఇంట్లో..

    కాలేజీ రోజుల్లో నిరూప్, తన స్నేహితులతో కలిసి తరచూ రాత్రుళ్ళు మైసూర్‌లోని చాముండి హిల్స్‌లో ఉండే పాడుబడిన ఇంటికి వెళ్ళే వారు. అక్కడ దయ్యాలు తిరుగుతుంటాయని, అక్కడి వారు చాలా మంది తాము వాటిని చూశామని చెప్పేవారు. ఇక నిరూప్ , తన స్నేహితులతో కలిసి ఒక పాత ఎస్టీమ్ కార్‌లో అక్కడికి వెళ్లేవారు. ఆ కార్ స్టార్ట్ అవడానికి సమయం తీసుకునేది. అందుకని ఏమన్నా జరిగితే అక్కడి నుండి త్వరగా వెళ్ళిపోవడానికి కార్ ఇంజిన్‌ను ఆపకుండా రన్నింగ్‌లో నే ఉంచేవారు అని నిరూప్ భండారి చెప్పారు.

     భయంతో కాళ్లు, చేతులు వణికాయి..

    భయంతో కాళ్లు, చేతులు వణికాయి..

    అలాంటి పరిస్థితుల్లో ఒకసారి తాను చేసిన సరదా (ప్రాంక్) పనిని నిరూప్ గుర్తు చేసుకున్నారు. అలా అక్కడికి వెళ్లిన ఒకసారి తానూ కావాలనే కార్ లైట్లు, ఇంజిన్ ఆఫ్ చేసేసి కార్ స్టార్ట్ అవనట్టు నటించానని, అది నిజమని నమ్మిన తన స్నేహితులకి ఆ సమయంలో భయంతో కాళ్ళు, చేతులు ఆడలేదని నిరూప్ ఆనాటి సరదా సంఘటనని గుర్తు చేసుకున్నారు నిరూప్

    Recommended Video

    'రాజరథం' లో రానా.. కనిపించడు..వినిపిస్తాడు !
     టపాసులు అంటించే సీన్

    టపాసులు అంటించే సీన్

    'రాజరథం' లోని 'కాలేజ్ డేస్' పాట చిత్రీకరణ సమయంలో జరిగిన ఇలాంటి మరో సరదా విషయాన్నీ నిరూప్ పంచుకున్నారు. 'కాలేజ్ డేస్' పాటలో నిరూప్ స్నేహితుడిగా కనిపించే శ్రీవత్స కి వెనక టపాసులు అంటించే దృశ్యం ఒకటి ఉంది.

    అతను వణికిపోతూ కనిపించాడు

    అతను వణికిపోతూ కనిపించాడు

    ఆ సీన్‌లో నిజమైన టపాసులు వాడుతున్నారని విషయం శ్రీవత్స కి తెలీదు. నిరూప్ తాను ఆ టపాసుల్ని అంటించాక వెంటనే వాటిని లాగేసి ఆర్పేయడం జరిగింది. కానీ అంతా అయ్యాక శ్రీవత్సని చూసినప్పుడు అతను వణికిపోతూ కనిపించాడు. దీంతో సెట్లో అందరూ ఒక్క సారిగా నవ్వేశారన్నారు.

     ర్యాగింగ్ సీన్లు షూట్

    ర్యాగింగ్ సీన్లు షూట్

    ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే, నిరూప్ ని కాలేజ్‌లో ఒక్క అనూప్ స్నేహితులు తప్ప ఎవరు ర్యాగింగ్ చేసేవారు కాదట. రాగ్గింగ్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నప్పుడు చాలా సరదాగా అనిపించేది. సీనియర్లు తమ మీద బాస్కెట్ బాల్ విసిరేయడం, వాళ్ళ కోసం బక్కెట్లు మోయడం లాంటి సంఘటనలు సరదాగా ఉండేవి. షూటింగ్ లో కొన్నిసార్లు బాస్కెట్ బాల్ మొహం మీద, కడుపులో కూడా గట్టిగ తగిలేదని షూటింగ్ విషయాలని నిరూప్ గుర్తు చేసుకున్నారు.

     మార్చి 23న రాజరథం

    మార్చి 23న రాజరథం

    'జాలీ హిట్స్' నిర్మాణంలో రొమాంటిక్ కామెడీ గా తెరకెక్కుతున్న 'రాజరథం' ని ప్రపంచవ్యాప్తంగా మార్చి 23 న విడుదల చేయనున్నారు. ఓవర్సీస్ లో 'జాలీ హిట్స్' వారే పంపిణీ చేస్తున్నారు.

    English summary
    Nirup Bhandari seems to have enjoyed filming "Rajaratham" directed by his brother Anup Bhandari who has blended a beautiful story line with technical excellence which brings back many memories of Nirup's college days. Here's the story where he talks about his real college life and how the reel life reflected the same in his upcoming film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X