హీరో నితిన్ కొత్త అవతారం, సక్సెస్ అవుతాడా?
నితిన్, రాశీ ఖన్నా జంటగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం 'శ్రీనివాస కళ్యాణం'. శతమానం భవతి లాంటి ఘన విజయం తరువాత దర్శకుడు సతీష్ వేగేశ్న దర్శకత్వం వహిస్తోన్న సినిమా ఇదే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.
శ్రావణమాసంలో ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి మిక్కీ జె.మేయర్ సంగీతాన్ని సమకూరుస్తుండగా, సమీర్‌రెడ్డి కెమెరా మెన్ గా పనిచేస్తున్నారు. ఈ సినిమాకు సంభంధించిన ఇతర నటీనటుల సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది.

తాజా సమాచారం మేరకు ఇందులో ఆర్కిటెక్ అవతారంలో కనిపించబోతున్నాడట నితిన్. ఇంటి నిర్మాణానికి సంభందించిన ప్లాన్స్ స్కెచ్ పేపర్ పై గీసి ఇవ్వడం నితిన్ ఉద్యోగం అన్నమాట. ఎంటర్టైన్మెంట్ తో పాటు ఫ్యామిలి ఎమోషన్స్ ఈ సినిమాలో ఉండబోతున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











