twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పాపం మెహర్ రమేష్ స్ధాయి అంతగా దిగజారిపోయిందా!?

    By Srikanya
    |

    జూ.ఎన్టీఆర్ తో చేసిన శక్తి చిత్రం డిజాస్టర్ కావటంతో తెలుగులో మెహర్ రమేష్ కి ధైర్యంగా డేట్స్ ఇచ్చే హీరో కనపడటం లేదు.దాంతో వరస ఫ్లాపులతో దూసుకుపోతున్న నితిన్ ని హీరోగా పెట్టి సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడని సమాచారం. దాంతో అంతా మెహర్ రమేష్ పరిస్ధితిని చూసి జాలిపడుతున్నారు. బిళ్ళా, కంత్రి,శక్తి వంటి భారి సినిమాలు చేసిన మెహర్ కి ఏమి దుర్ధస కాకపోతే పోయి పోయి నితిన్ తో సినిమా చేయాలని నిర్ణయించుకుంటాడని అంటున్నారు. అయితే మెహర్ మాత్రం ఈసారి ఎలాగైనా హిట్ కొడతానని, ఎప్పటిలాగే పాటందుకుని, ప్లాపుల్లో ఉన్న హీరోకి హిట్ ఇస్తేనే తన విలువేంటో ఇండస్ట్రికి తెలిసివస్తుందని ఛాలెంజ్ లు చేస్తున్నాట్ట. ఇక ఓ ఛోటా నిర్మాత ఈ చిత్రం నిర్మిస్తున్నాడని తెలుస్తోంది. నితిన్ తండ్రి ఈ చిత్రానికి ఫైనాన్స్ చేస్తున్నాడని,భారీతనం లేకుండా చేయమని మెహర్ కి క్లియర్ గా చేయమని చెప్పారని అంటున్నారు. నితిన్ మాత్రం తన ప్రక్కన స్టార్ హీరోయిన్ ని తీసుకుంటే కథ,దర్శకుడు వంటివి అనవరసరం అన్నట్లుగా బిహేవ్ చేస్తున్నాట్ట. అదీ సంగతి.

    English summary
    Meher Ramesh who made his debut with Kantri and went on to direct high budget movies like Billa, Shakti is doing a film with Nitin in the main lead.Meher Ramesh is following the path of director VV Vinayak and Rajamouli who have directed Nitin in the process of increasing their brand value.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X