For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్యాక్‌గ్రౌండ్ లేకుండా టాప్ హీరోగా గ్రేట్.. యువ హీరోలకు ఆదర్శం.. శర్వాపై నితిన్ ప్రశంసలు

|

హీరో శర్వానంద్‌ నటించిన 'రణరంగం' సినిమా ప్రీ రిలీజ్‌ వేడుక హైదారాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కథానాయకుడు నితిన్‌ ముఖ్య అతిధి గా విచ్చేశారు. 'రణరంగం' సినిమాలో శర్వానంద్ సరసన కాజల్‌, కల్యాణి ప్రియదర్శిని కథానాయికలుగా నటించారు. సుధీర్‌ వర్మ దర్శకుడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల అవుతోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు విశేషమైన స్పందన లభించింది. మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ విడుదల చేసిన 'రణరంగం' సౌండ్‌ కట్‌ ట్రైలర్‌కు విశేష ప్రాచుర్యం లభించింది. ఈ నేపథ్యంలో జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో చిత్ర యూనిట్ సభ్యులు , హీరో అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా..

 డైరెక్టర్ సుధీర్ వర్మ టేకింగ్

డైరెక్టర్ సుధీర్ వర్మ టేకింగ్

హీరో శర్వానంద్ మాట్లాడుతూ.. 'సినిమా బాగా వచ్చింది, డైరెక్టర్ సుధీర్ వర్మ టేకింగ్ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలువనుంది. హీరోయిన్స్ ఇద్దరూ బాగా నటించారు. కెమెరామెన్ దివాకర్ మణి విజువల్స్ హైలెట్ కానున్నాయి. సినిమా చూసి నిర్మాత వంశీ కాల్ చేశారు. చిత్రం బాగా వచ్చింది. నేను హ్యాపీ గా ఉన్నానని వంశీ చెప్పడం నాకు చాలా ఆనందమేసింది. రణరంగం చూసిన మా యూనిట్ అందరూ చాలా బాగుంది అన్నారు. రేపు సినిమా విడుదల తరువాత ప్రేక్షకులు కూడా అదే అంటారని నమ్మకం తో ఉన్నాను. మా నిర్మాత వంశీ భవిష్యత్తులో చేయబోయే అన్నీ సినిమాలు విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

 ఖర్చుకు వెనుకాడకుండా ప్రొడక్షన్

ఖర్చుకు వెనుకాడకుండా ప్రొడక్షన్

డైరెక్టర్ సుధీర్ వర్మ మాట్లాడుతూ.. రణరంగం సినిమాకు వర్క్ చేసిన టెక్నీషియన్స్ అందరికి థాంక్స్, ముఖ్యంగా కెమెరామెన్ దివాకర్, ఆర్ట్ డైరెక్టర్ రవి, ఫైట్ మాస్టర్ వెంకట్ ఈ సినిమాకు బాగా హెల్ప్ అయ్యారు. నిర్మాత వంశీ ఖర్చుకు ఎక్కడా వెనుకాడకుండా ఈ సినిమాను రూపొందించారు. కల్యాణి బాగా నటించింది. ఈ సినిమా చెయ్యడానికి ఒప్పుకున్న కాజల్ కు థాంక్స్. శర్వా రెండు విభిన్న పాత్రల్లో బాగా నటించారు. సినిమా విడుదల తరువాత మరిన్ని విశేషాలు మీతో పంచుకుంటాను అన్నారు.

 తెరపైన అద్భుతంగా

తెరపైన అద్భుతంగా

హీరొయిన్ కల్యాణి ప్రియదర్శన్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో నేను భాగమయినందుకు హ్యాపీ‌గా ఫీల్ అవుతున్నాను. డైరెక్టర్ సుధీర్ వర్మ తాను అనుకున్న కథను అద్భుతంగా స్క్రీన్‌పై ప్రెజెంట్ చేశారు. హీరో శర్వానంద్ నాకు ఇన్స్పిరేషన్ తన దగ్గర ఈ సినిమా చేస్తున్నప్పుడు చాలా నేర్చుకున్నాను. కాజల్ తో కలిసి నటించే అవకాశం రావడం గొప్ప విషయం. షూటింగ్ సమయంలో నిర్మాతల సపోర్ట్ మరువలేనిది. రణరంగం అందరిని అలరిస్తుందని అనుకుంటున్నా' అన్నారు.

 శర్వానంద్‌పై నితిన్ ప్రశంసలు

శర్వానంద్‌పై నితిన్ ప్రశంసలు

హీరో నితిన్ మాట్లాడుతూ.. ఈ కథ విన్నప్పుడు శర్వా ఈ సినిమాలో45 ఇయర్స్ మ్యాన్ గా ఎలా కనిపిస్తాడు అనుకున్న కానీ పోస్టర్స్ , ప్రోమోస్ చూస్తుంటే కరెక్ట్ గా సెట్ అయ్యాడు. ఏ బ్యాక్ సపోర్ట్ లేకుండా శర్వా ఈ స్థానంలో ఉండడం నిజంగా గొప్ప విషయం. ఎంతో మంది యువ హీరోలకు శర్వా ఆదర్శం. ఈ సినిమా అన్నీ వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని నమ్ముతున్నాను. డైరెక్టర్ సుధీర్ వర్మ మంచి టెక్నీషియన్ ఈ సినిమాతో తాను మరోసారి మంచి డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకుంటాడని అనుకుంటున్నా. నిర్మాత వంశీకి ఈ సినిమా పెద్ద సక్సెస్ అయ్యి మంచి లాభాలు రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

 సుధీర్ వర్మతో రెండో సినిమా

సుధీర్ వర్మతో రెండో సినిమా

కెమెరామెన్ దివాకర్ మణి మాట్లాడుతూ... నేను డైరెక్టర్ సుధీర్ వర్మతో కలిసి చేస్తున్న రెండో సినిమా ఇది. ఈ సినిమా విజువల్స్ కొత్తగా ఉంటాయి. నిర్మాత వంశీ సపోర్ట్ మరువలేనిది. శర్వా లవ్లీ యాక్టర్. అతనితో పనిచెయ్యడం కంఫర్ట్ గా ఉంటుంది. హీరోయిన్స్ కాజల్, కల్యాణి బాగా నటించారు. నా కెమెరా డిపార్ట్మెంట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికి థాంక్స్. ఆడియన్స్ కు ఈ సినిమా నచ్చుతుందని భావిస్తున్న అన్నారు.

 సాంకేతిక వర్గం

సాంకేతిక వర్గం

మాటలు: అర్జున్ - కార్తీక్,

సంగీతం : ప్రశాంత్ పిళ్ళై ,

ఛాయాగ్రహణం :దివాకర్ మణి,

పాటలు: రామజోగయ్య శాస్త్రి, కృష్ణ చైతన్య,

ఎడిటర్: నవీన్ నూలి,

ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్,

పోరాటాలు: వెంకట్,

నృత్యాలు: బృంద, శోభి, శేఖర్,

ప్రొడక్షన్ కంట్రోలర్: సి.హెచ్. రామకృష్ణారెడ్డి,

సమర్పణ: పి.డి.వి.ప్రసాద్.

నిర్మాత: సూర్యదేవర నాగవంశీ

రచన-దర్శకత్వం: సుధీర్ వర్మ

English summary
Actor Sharwanand's up coming release Ranarangam's pre-release event was held on a grand scale yesterday. Nithiin attended the event as the chief guest. The gangster drama is all set to hit the silver screens on August 15th. Here's what the movie unit said at the pre-release event. Nithiin opined that Sharwanand's hard work and dedication shaped up his career. He added that Sharwa did a great job in the film and his mature act gives a lot of depth to the plot.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more