రెండున్నర గంటల్లో: తాగుబోతు రమేష్‌తో నితిన్ (ఫోటోలు)

By Bojja Kumar

హైదరాబాద్: వచ్చే వారం నితిన్ నటించిన ‘చిన్నదాన నీకోసం' సినిమా విడుదల నేపథ్యంలో....సినిమా హిట్ కావాలని కోరుకుంటూ నితిన్ శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కొండపైకి కాలినడకన చేరుకున్నారు. నితిన్ తో పాటు హాస్య నటుడు తాగుబోతు రమేష్ కూడా తిరుమలను దర్శించుకున్నారు. దేవుడి దయ వల్ల 2 గంటల 25 నిమిషాల్లో విజయవంతంగా తిరుపతి నుండి తిరుమల మెట్లు ఎక్కేసాను అంటూ...నితిన్ తన సోషల్ నెట్వర్కింగులో పేర్కొన్నారు.

శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై ‘చిన దాన నీకోసం' చిత్రాన్ని ఆయన సోదరి నిఖితా రెడ్డి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా గురించి నిఖితా రెడ్డి మాట్లాడుతూ... ‘ప్రేమ, వినోదం, కుటుంబ బంధాలు కలగలిపిన కథ ఇది. కోరుకున్న అమ్మాయి కోసం కథానాయకుడు ఏం చేసాడన్నది తెరపిస్తున్నామన్నారు. ఈచిత్రం విజయంపై పూర్తి నమ్మకం ఉందన్నారు.

స్లైడ్ షోలో సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు.....

చిన్నదాన నీకోసం

చిన్నదాన నీకోసం

ఈ చిత్రానికి "అమృతం" ఫేం హర్షవర్థన్ మాటలు అందిస్తున్నాడు. ఇష్క్, గుండె జారి గల్లంతయ్యిందే చిత్రాలలకు సంగీతం అందించిన అనూప్ సంగీతాన్ని అందించారు. నితిన్ సరసన మిష్టి చక్రవర్తి నటిస్తోంది.

అంచనాలు భారీగా

అంచనాలు భారీగా

సాఫ్ట్ లవ్ స్టోరీస్ తో ప్రేక్షకులను మెప్పించే కరుణాకరన్, నితిన్ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం అంచనాలు భారీగానే ఉన్నాయి.

పవన్ కళ్యాణ్ మార్కు

పవన్ కళ్యాణ్ మార్కు

పవన్ కళ్యాణ్ వీరాభిమాని అయిన నితిన్ గతంలో తన సినిమాల్లో పవర్ స్టార్ మార్కు ఉండేలూ చూసుకున్నాడు. ‘చినదాన నీకోసం' సినిమాలోనూ నితిన్ మరోసారి పవర్ కళ్యాణ్ మార్కు ఉండేలా ప్లాన్ చేసాడు. ఈ సినిమాలోని పాటల్లో, సీన్లలో, నితిన్ స్టైల్ లో మొత్తం పవన్ కళ్యాణ్ ఛాయలే కనిపిస్తుండటం గమనార్హం.

పాటలు కూడా...

పాటలు కూడా...

ఇక ఈ సినిమాలోని నితిన్ ఇంట్రడక్షన్ సాంగ్....గుడుంబా శంకర్, ఖుషి చిత్రాల్లోని పాటల్లా ఉండటం గమనార్హం. ఇటీవల జరిగిన ఈ చిత్రం ఆడియో ఫంక్షన్లో కూడా నితిన్ పవన్ నామ స్మరణ చేసిన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X