»   » హీరో పవన్‌కు ఏడాది జైలు, రూ. 1.5 కోట్లు కట్టాల్సిందే!

హీరో పవన్‌కు ఏడాది జైలు, రూ. 1.5 కోట్లు కట్టాల్సిందే!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: చెక్‌బౌన్స్‌ కేసులో తెలుగు హీరోకు కు జైలు శిక్షపడింది. నీతోనే నేనున్నా...చిత్రంలో హీరోగా నటించిన పవన్‌ కుమార్‌కు సంగారెడ్డి కోర్టు చెక్ బౌన్స్ కేసులో ఈ శిక్ష విధించింది. దీంతో పాటు కక్షిదారుకు రూ.1.5కోట్లు చెల్లించాలని వెలువరించింది.

చెక్ బౌన్స్ కేసులో విషయంలో చట్టంలో ఇటీవలే మార్పులు జరిగిన సంగతి తెలిసింద. ఏ బ్యాంకులో అయితే చెక్ బౌన్స్ అయిందో ఇక నుంచి అక్కడే కేసును నమోదు చేసేలా కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. ఇటీవలి పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఆమోదం పొందిన నెగోషబుల్ ఇన్ స్ట్రుమెంట్స్ బిల్లు సవరణలను కేంద్ర నోటిఫై చేయడంతో, చెక్ బౌన్స్ విషయంలో కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి.

Hero Pavan Kumar gets 1 year jail in cheque bounce case

ఈ కొత్త చట్టం ద్వారా ఇకపై చెక్కును జమ చేసిన బ్యాంకు ఉన్న ప్రాంతంలోనే, కేసు పెట్టవచ్చు. అత్యధిక కేసుల్లో ఫిర్యాదిదారులు వాయిదాల నిమిత్తం ఎంతో దూరం ప్రయాణించాల్సి వస్తోంది. ఈ కొత్త సవరణ అమల్లోకి రావడంతో ఇకపై చెక్ బౌన్స్ కేసుల్లో సులువుగానే కేసులు పెట్టే అవకాశం ఏర్పడింది.

English summary
Tollywood Hero Pavan Kumar gets 1 year jail in cheque bounce case. Pavan Kumar acted in Neethone Nenunna movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu