నెంబర్ వన్ హీరో ఎవరంటే? : హీరో ప్రభాస్
తాను నెంబర్ వన్ కావడానికి ఇంకా చాలా సమయం ఉందని ప్రభాస్ చెప్పుతున్నారు. ఇంకొక ఐదారు చిత్రాలు సూపర్‌హిట్ అయితేనేకాని ఆ మాటను తాను ఒప్పుకోనని, ప్రస్తుతానికి మాత్రం నెంబర్ వన్ తాను కానని చెప్పారు.
తన సినిమాలు ఎలా ఆడినా, కలెక్షన్లు ఎలా వచ్చినా ఇతర్ల సినిమాల గురించి తాను పట్టించుకోనని తెలిపారు. త్వరలో రాజవౌళి దర్శకత్వంలో నిర్మాణం కానున్న 'బాహుబలి' చిత్రానికి రెండు సంవత్సరాల కాలాన్ని వెచ్చిస్తున్నానని, ఈ చిత్రంలో నటించే సమయంలో మరే చిత్రంలో నటించడానికి ఒప్పుకోవడంలేదని అన్నారు.
ఎందుకంటే రాజవౌళి షూటింగ్‌కు ఎటువంటి ఇబ్బంది కలిగించడం ఇష్టంలేక ఈ నిర్ణయం తీసుకున్నానని ప్రభాస్ చెపుతున్నారు. అయితే 'బాహుబలి' చిత్రం విడుదలయ్యాక 'మగధీర', 'ఈగ' చిత్రాలను మించిపోయే రికార్డులను సాధిస్తుందని, అప్పుడు తప్పక ఎవ్వరైనా సరే ప్రభాసే నెంబర్ వన్ అంటారని అభిమానులు చెబుతుండడం విశేషం.


Click it and Unblock the Notifications












