రాజమౌళి అన్నట్లు ప్రభాస్ నిజంగానే రాక్షసుడు.. అస్సలు గ్యాప్ ఇవ్వడం లేదుగా..

రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ దిగ్గజాలకు కూడా దక్కని క్రెడిట్ ఒక్క బాహుబలితో ఆల్ ఇండియా మార్కెట్ ను సొంతం చేసుకున్నాడు. బాహుబలి ఒక శాంపిల్ మాత్రమే అని ప్రస్తుతం సిద్ధమవుతున్న సినిమాలను చూస్తేనే అర్థమవుతోంది. ఒక్కో సినిమా నెవర్ బిఫోర్ అనేలా రెడీ అవుతోంది. అయితే బాహుబలి ఇంటర్వ్యూలలో దర్శకుడు రాజమౌళి ప్రభాస్ ఒక విషయంలో రాక్షసుడు అని ఓపెన్ గా చెప్పేశారు. ఇప్పుసు మరోసారి అది నిజమవుతోంది.

ఏదైనా స్నేహితులు ఉంటేనే..

ఏదైనా స్నేహితులు ఉంటేనే..

ప్రభాస్ తన కుటుంబ సభ్యులతో ఎంత బిజీగా ఉన్నా కూడా స్నేహితులను మాత్రం అస్సలు వదిలిపెట్టడని అందరికి తెలిసిన విషయమే. ఏదైనా సరే ముందు ఫ్రెండ్స్ ఉంటేనే హ్యాపీగా ఉంటామని తన అభిమానులకు కూడా చెబుతూ ఉంటాడు. పాన్ ఇండియా స్టార్ అయినప్పటికీ సింపుల్ గా ఉండడానికే ఎక్కువగా ఇష్టపడతాడు.

పెళ్లి మ్యాటర్ నుంచి బాగానే తప్పించుకున్నాడు

పెళ్లి మ్యాటర్ నుంచి బాగానే తప్పించుకున్నాడు

ప్రస్తుతం ప్రభాస్ లైనప్ చూస్తుంటే రానున్న రోజుల్లో ఎవ్వరికీ దొరికేలా లేడని అనిపిస్తోంది. సినిమాల కారణంతో పెళ్లి విషయాన్ని బాగానే వాయిదా వేస్తున్నాడు. అసలైతే బాహుబలి తరువాతే పెళ్లి ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ ఆ తరువాత వచ్చిన ఆఫర్స్ తో బిజీగా ఉండడం వలన ఇంట్లో వాళ్ళు కూడా డార్లింగ్ ను కదిలించడం లేదు.

ఆ విషయంలో రాక్షసుడు

ఆ విషయంలో రాక్షసుడు

బాహుబలి కోసం 5 ఏళ్ళు కష్టపడిన ప్రభాస్ అసలు ఆ సినిమాను ఎలా పూర్తి చేస్తాడా అని మొదట్లో చాలా మంది అనుకున్నారట. ఆయన బద్దకస్తుడు అని సన్నిహితులకు బాగా తెలుసు. రాజమౌళి కూడా చాలా ఇంటర్వ్యూలలో ఓపెన్ గానే ఆ విషయాన్ని చెప్పేశాడు. కానీ అది పర్సనల్ విషయాల వరకే ఉంటుందని, ఒక్కసారి షూటింగ్ స్పాట్ లోకి వస్తే మాత్రం పని రాక్షసుడు అని వివరించారు.

బిజీబిజీగా..

బిజీబిజీగా..

ఇక ప్రస్తుతం ప్రభాస్ సెట్ చేసుకున్న బిజీ షెడ్యూల్ ను చూస్తుంటే అది నిజమనే అనిపిస్తోంది. ఎలాగైనా రాధేశ్యామ్ ను పూర్తి చేయాలని జూన్ చివరి వారం వరకు షూటింగ్ లోనే పాల్గొంటాడట. మళ్ళీ పెద్దగా గ్యాప్ లేకుండా వెంటనే సలార్ కు ఫీనిషింగ్ టచ్ ఇవ్వాలని జూలై నుంచి బిజీ కానున్నాడు.

ఒకవైపు అది చేస్తూనే మరోవైపు ఆదిపురుష్ షూటింగ్ ను కూడా సెప్టెంబర్ లో పట్టాలెక్కించి ఫినిష్ అయ్యే వరకు బ్రేక్ ఇవ్వకూడదని ఫిక్స్ అయ్యాడట. ఈ విధంగా రెబల్ స్టార్ వరుస షూటింగ్స్ తో పని రక్షసుడిలా మారిపోనున్నాడని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X