రాంచరణ్‌తో నటించడానికి అందుకే ఒప్పుకున్నా.. జీన్స్ హీరో ప్రశాంత్!
ఇటీవల వినయ విధేయ రామ టీజర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ టీజర్ మెగా అభిమానులని అలరిస్తోంది. ఈ టీజర్ లో చరణ్ తో పాటు మరో స్టార్ హీరో కూడా మెరిశాడు. ఎట్టకేలకు అతడిని గుర్తించిన అభిమానులు సోషల్ మీడియాలో పిక్స్ వైరల్ చేసారు. శంకర్ దర్శత్వంలో వచ్చిన జీన్స్ చిత్రాన్ని ఎవరూ మరచిపోలేరు. మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ కు జోడిగా నటించిన రొమాంటిక్ హీరో ప్రశాంత్ ని కూడా అంత త్వరగా మరచిపోలేము. ఈ చిత్రంలో ప్రశాంత్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రశాంత్ వినయ విధేయ రామ చిత్రం గురించి స్పందించాడు.

పూర్తిగా మారిపోయి
జీన్స్ చిత్రంలో ప్రశాంత్ ని చూసిన అభిమానులు వినయ విధేయ రామలో అతడిని చూస్తే ఆశ్చర్య పోవడం ఖాయం. టీజర్ లో ప్రశాంత్ కనిపించింది కొన్ని సెకండ్ల పాటే అయినా గుర్తు పట్టలేని విధంగా అతడి రూపు రేఖలు మారిపోయి ఉన్నాయి. టీజర్ లోని అతడి లుక్, గతంలో రొమాంటిక్ గా ఉన్న లుక్ ని పోలుస్తూ సోషల్ మీడియాలో అభిమానులు ఈ హీరో గురించి చర్చించుకున్నారు. వారందరికీ ప్రశాంత్ క్లారిటీ ఇచ్చాడు.

రాంచరణ్ నాకు ఫ్రెండ్
తమిళంలో ఇప్పుడు స్టార్ హీరోగా ఉన్నా ప్రశాంత్ ఈ చిత్రంలో క్యారెక్టర్ రోల్ చేయడం ఏంటని అభిమానులు వాపోయాడు. వినయ విధేయ రామ చిత్రం గురించి ప్రశాంత్ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో నేను నటించడానికి రాంచరణ్, దర్శకుడు బోయపాటి శ్రీను ప్రధాన కారణం. రాంచరణ్ నాకు మంచి స్నేహితుడు. కథ అద్భుతంగా ఉండడంతో ఆలోచించకుండా ఒకే చెప్పేశా అని ప్రశాంత్ తెలిపాడు.

అద్భుతమైన సన్నివేశాలు
సినిమాలో రాంచరణ్, నాకు మధ్య వచ్చే సన్నివేశాలు హైలైట్ గా నిలుస్తాయి. మా ఇద్దరి మధ్య అనుబంధాన్ని దర్శకుడు అద్భుతంగా చిత్రీకరించారు అని ప్రశాంత్ తెలిపాడు. ఈ పాత్రని నాకోసమే రాసానని బోయపాటి అన్నారు. ఎలాంటి చిత్రం అయినా పాత్ర బావుంటే చాలు. హీరో అనేది కూడా చిత్రంలో ఒక పాత్రే. భవిషత్తులో కూడా హీరోగా కొనసాగుతూనే పాత్ర నచ్చితే క్యారెక్టర్ రోల్స్ చేస్తానని ప్రశాంత్ తెలిపాడు.

జానీ చిత్రంలో
ప్రస్తుతం ప్రశాంత్ జానీ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. డిసెంబర్ లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని ప్రశాంత్ తెలిపాడు. ఈ చిత్రంలో పాటలు ఉండవని ప్రశాంత్ క్లారిటీ ఇచ్చారు. కథ నుంచి పక్కకు వెళ్లకుండా ఉండేందుకు పాటలు చిత్రీకరించలేదని ప్రశాంత్ తెలిపాడు. సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులు కథలో లీనమైపోతారు. పాటల గురించి ఆలోచించరు అని తెలిపాడు.


Click it and Unblock the Notifications











