twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాజ్ తరుణ్ అరెస్ట్.. కారు యాక్సిడెంట్ కేసులో పోలీసుల ఝలక్

    |

    Recommended Video

    Hero Raj Tarun Was Arrested || Filmibeat Telugu

    యువ హీరో రాజ్ తరుణ్‌ను మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం తెల్లవారు జామున హైదరాబాద్ శివారు ప్రాంతమైన నార్సింగ్ పరిధిలోని అల్కాపూర్ వద్ద ఓ కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం తర్వాత సంఘటనా స్థలం నుంచి రాజ్ తరుణ్ పోరిపోయినట్టు సీసీ పుటేజీల్లో స్పష్టమైంది. ఈ క్రమంలో విచారణ చేపట్టిన మాదాపూర్ పోలీసులు శుక్రవారం ఉదయం రాజ్ తరుణ్‌ను అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే...

    మాదాపూర్ పోలీసుల దర్యాప్తుతో

    మాదాపూర్ పోలీసుల దర్యాప్తుతో

    రాజ్ తరుణ్ కారు యాక్సిడెంట్ అంశం రెండు రోజులుగా మీడియాలో హైడ్రామా నడుస్తున్నది. ఈ క్రమంలో పలు అంశాలను ఆధారంగా చేసుకొని పోలీసులు దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో పలు సాక్ష్యాలను సేకరించిన తర్వాత రాజ్ తరుణ్‌ను అరెస్ట్ చేసినట్టు పోలీసులు మీడియాకు సమాచారం అందించారు. రాజ్ తరుణ్‌పై 279, 336 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

     స్టేషన్ బెయిల్

    స్టేషన్ బెయిల్

    రాజ్ తరుణ్ అరెస్ట్ అనంతరం ఆయన సన్నిహితులు, శ్రేయోభిలాషులు బెయిల్ కోసం ప్రయత్నించారు. ఈ కేసులో రాజ్ తరుణ్‌కు పూచికత్తు మీద స్టేషన్ బెయిల్ ఇచ్చినట్టు పేర్కొన్నారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు పేర్కొన్నట్టు సమాచారం.

    యాక్సిడెంట్ వివాదంతో

    యాక్సిడెంట్ వివాదంతో

    అలకాపురి ప్రాంతంలో కారు ప్రమాదానికి గురైన సమయంలో రాజ్ తరుణ్‌ను కార్తీక్ దృశ్యాలను తన సెల్ ఫోన్లో రికార్డు చేశాడు. అంతేకాకుండా హీరో రాజ్ తరుణ్ కారు దిగి పారిపోతుండగా అతన్ని వెంటాడి పట్టుకున్నాడు కార్తీక్. ఆ తర్వాత రాజ్‌ తరుణ్‌ను స్వయంగా ఇంటి దగ్గర దించినట్టు స్వయంగా కార్తీక్ తెలిపారు. ఆ సందర్భంగా జరిగిన చర్చల్లో తేడా రావడంతో వారి మధ్య వివాదం చోటుచేసుకొన్నది.

     మద్యం సేవించారా?

    మద్యం సేవించారా?

    కారు యాక్సిడెంట్ తర్వాత రాజ్ తరుణ్ కనిపించకుండా పోయారు. అయితే ప్రమాదం సమయంలో రాజ్ తరుణ్ మద్యం సేవించాడా అనే అనుమానాలు తలెత్తాయి. ఈ క్రమంలో వీడియో ద్వారా ఓ సందేశాన్ని పంపించాడు. తనకు ఎలాంటి గాయాలు కాలేవని, తాను క్షేమంగా ఉన్నాను అని వీడియో సందేశంలో పేర్కొన్నారు.

     వీడియోలు డిలీట్ చేయమని

    వీడియోలు డిలీట్ చేయమని

    రాజ్ తరుణ్ యాక్సిడెంట్‌కు సంబంధించిన వీడియో వ్యవహారం వివాదంగా మారింది. ఈ వీడియోను తీసిన కార్తీక్ మీడియాతో మాట్లాడుతూ.. రాత్రి సంఘటన తర్వాత ఉదయం తనకు ఫోన్ చేసి వీడియోలు డిలీట్ చేయమని అడిగాడు. ఐదు లక్షలు ఇవ్వడానికి కూడా సిద్దపడ్డారు అనే విషయాన్ని ఫోన్ కాల్‌లో రికార్డు చేసిన వాయిస్ ఫైల్‌లో స్పష్టమైంది. అయితే రాజా రవీంద్ర బేరసారాలు జరిపినట్టు ఎక్కడ స్పష్టంగా వినిపించకపోవడం గమనార్హం.

    English summary
    Hero Raj Tarun arrested
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X