హీరోయిన్‌తో క**గ్.. బ్లూఫిల్మ్‌లో జరిగినట్లే: తొలిసారి బయటపెట్టిన రాజ్ తరుణ్

సాధారణంగా ఏ హీరో అయినా హైలైట్ అవ్వాలంటే సినిమాల్లోనే నటించాల్సిన పని లేదు. ఈ మధ్య కాలంలో వివాదాల కారణంగానూ చాలా మంది స్టార్లు సెన్సేషన్ అవుతోన్నారు. అలాంటి వారిలో రాజ్ తరుణ్ ఒకడు. సినిమాల పరంగా పెద్దగా పేరును సొంతం చేసుకోలేకపోయిన అతడు.. లావణ్య వివాదంతో హాట్ టాపిక్ అయిపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఇటీవలే రెండు చిత్రాలతో వచ్చాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు 'భలే ఉన్నాడే' అనే సినిమాను చేశాడు. ఈ మూవీ ప్రమోషన్‌లో ఓ డైరెక్టర్‌పై రాజ్ తరుణ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ వివరాలు మీకోసమే!

రాజ్ తరుణ్‌ కేసుతో సెన్సేషన్
యంగ్ హీరో రాజ్ తరుణ్‌కు ఓ యువతి కోలుకోలేని షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే కెరీర్ పరంగా చాలా ఇబ్బందులు పడుతోన్న అతడిపై లావణ్య అనే ఓ అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలాగే, రాజ్ తరుణ్ తనను మోసం చేశాడని, హీరోయిన్‌తో ఎఫైర్ పెట్టుకున్నాడని సంచలన ఆరోపణలు చేసింది. దీంతో ఈ అంశం దేశ వ్యాప్తంగా సెన్సేషన్ అయింది.

Hero Raj Tarun First Time Reveals About Romantic Story Movie Offer

బిగిసిన ఉచ్చు.. పేరు కలిపేసి

లావణ్య పెట్టిన కేసు రోజుకో మలుపు తిరుగుతూ వచ్చింది. మొదట్లో ఈ కేసుతో రాజ్ తరుణ్‌కు ఎలాంటి సంబంధం లేదు అన్నట్లుగా వార్తలు వచ్చాయి. కానీ, ఆ తర్వాత సదరు అమ్మాయి సరైన ఆధారాలను తీసుకు వచ్చి పోలీసులకు అప్పగించింది. దీనికితోడు మాల్వీ, రాజ్ తరుణ్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఇక, ఇటీవలే అతడి పేరును చార్జ్‌షీట్‌లో యాడ్ చేసేశారు.

రెండు సినిమాలతో వచ్చాడు
ఈ మధ్య కాలంలో రాజ్ తరుణ్.. లావణ్య పెట్టిన కేసు వల్ల తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఈ వివాదం ఇలా నడుస్తుండగానే అతడు కొద్ది రోజుల వ్యవధిలోనే 'పురుషోత్తముడు', 'తిరగబడరా సామీ' అనే రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇవి బాక్సాఫీస్ వద్ద ఆశించిన రీతిలో రెస్పాన్స్‌ను సొంతం చేసుకోలేకపోయాయి. ఫలితంగా రాజ్‌ తరుణ్‌కు షాక్ తగిలింది.

Hero Raj Tarun First Time Reveals About Romantic Story Movie Offer

భలే ఉన్నాడే అంటూ రెడీగా

వివాదాలతో సతమతం అవుతోన్న రాజ్ తరుణ్ ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగానే ఇటీవలే అతడు 'భలే ఉన్నాడే' అనే చిత్రంలోనూ నటించాడు. శివ సాయి వర్ధన్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని డైరెక్టర్ మారుతి తన బ్యానర్‌లో నిర్మించారు. దీంతో ఈ చిత్రంపై అంచనాలు ఏర్పడ్డాయి. సెప్టెంబర్ 13వ తేదీన ఈ సినిమా ఆడియెన్స్ ముందుకు రానుంది.

అలాంటి స్టోరీ చెప్పాడంటూ
'భలే ఉన్నాడే' సినిమా విడుదలకు సమయం దగ్గర పడడంతో రాజ్ తరుణ్ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. అలా అతడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో కనిపించాడు. ఈ సందర్బంగా రాజ్ తరుణ్ మాట్లాడుతూ 'కొద్ది రోజుల క్రితం ఓ డైరెక్టర్ నాకు కథ వినిపించడానికి వచ్చాడు. అతడు హీరోయిన్ ఇంట్లో ఎవరూ లేనప్పుడు మీరేళ్లి కప్లింగ్ చేస్తారు' అని చెప్పుకొచ్చాడు.

Hero Raj Tarun First Time Reveals About Romantic Story Movie Offer

బ్లూఫిల్మ్‌లు చేయను అంటూ

తనకు రొమాంటిక్ స్టోరీని చెప్పిన డైరెక్టర్‌కు రాజ్ తరుణ్ గట్టి సమాధానమే చెప్పినట్లు తెలిపాడు. 'నాకు అతడు కథ చెప్పగానే నేను ఒక్కటే మాట అన్నాను. నేను సినిమాలు మాత్రమే చేయాలని అనుకుంటున్నాను. బ్లూఫిల్మ్‌లు కాదు అని అతడికి చెప్పేశా' అంటూ రాజ్ తరుణ్ వివరించాడు. ఇప్పుడు అతడు చేసిన ఈ వ్యాఖ్యలు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతున్నాయి.

More from Filmibeat

Read more about: raj tarun lavanya bhale unnade
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X