నీ వల్లే ఆమె ఆత్మహత్య.. రాజ్ తరుణ్ లవర్ లావణ్య సంచలన ఆరోపణలు.. ఆడియో క్లిప్ వైరల్

రాజ్ తరుణ్ - లావణ్య కేసు ట్విస్టుల మీద ట్విస్టులతో సాగుతూ టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. తనను మోసం చేసి హీరోయిన్ మాల్వీ మల్హోత్రాతో రాజ్ తరుణ్ ఎఫైర్ పెట్టుకున్నాడని లావణ్య కొద్దిరోజుల క్రితం నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అన్విక అన్న పేరుతో ఒకే ఇంట్లో ఉన్నామని.. తాను గర్భం దాల్చితే రాజ్ తరుణే అబార్షన్ చేయించాడని ఆమె ఆరోపించింది. రాజ్‌ను వదిలేయాలని, లేనిపక్షంలో అంతు చూస్తామని మాల్వీ , ఆమె సోదరుడు తనకు వార్నింగ్ ఇచ్చారని లావణ్య ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు మెడికల్ రిపోర్ట్స్, దాదాపు 170కి పైగా ఫోటోలను పోలీసులకు అందజేసింది. వీటి ఆధారంగా రాజ్ తరుణ్‌పై ఐపీసీ సెక్షన్ 420, 493, 506 కింద పోలీసులు కేసు నమోదు చేయడంతో పాటు నోటీసులు కూడా జారీ చేశారు.

కెరీర్ పరంగా తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న రాజ్ తరుణ్.. ఇప్పుడు పర్సనల్ లైఫ్‌లోనూ సమస్యలతో సతమతమవుతున్నాడు. లావణ్య కేసులో అతనికి శిక్షపడితే రాజ్‌తో సినిమాలు కమిటైన దర్శక, నిర్మాతలుకు ఇబ్బందులు తప్పవు. అటు ఈ యువ హీరో సైతం లావణ్య ఆరోపణలపై లీగల్‌గానే ఫైట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే లావణ్యతో రాజీచేసుకునేందుకు రాజ్ తరుణ్ సైతం సిద్ధమయ్యారని.. ఇందుకోసం డబ్బులు ఆఫర్ చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి.

hero raj tarun friend rj sekhar basha phone call with lavanya audio goes viral

రాజ్ తరుణ్ మేనేజర్, ఓ లాయర్ నుంచి తనకు రెండుసార్లు ఫోన్ కాల్స్ వచ్చాయని.. కేసు విత్‌డ్రా చేసుకుని, క్షమాపణలు చెబితే రూ.5 కోట్లు ఇస్తామన్నారని, కానీ ఆ ఆఫర్ తిరస్కరించినట్లు లావణ్య తెలిపారు. ఇప్పటికే కేసులో ఎన్నో చిక్కుముడులు ఉండగా... రోజుకొక కొత్త వ్యక్తి ఎంట్రీ ఇస్తున్నాడు. తాజాగా ఈ వివాదంలో రాజ్ తరుణ్ ఫ్రెండ్‌నంటూ ఆర్‌జే శేఖర్ భాషా ఎంట్రీ ఇచ్చాడు.

లావణ్యతో శేఖర్ మాట్లాడుతున్నట్లుగా ఉన్న ఓ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో లావణ్యకు , శేఖర్‌కు మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. మా గురించి ఎందుకు మాట్లాడుతున్నావంటూ శేఖర్‌ను లావణ్య నిలదీయగా.. మీరే రాజ్ ఇల్లు కొట్టేసే ఉద్దేశంతో ఇదంతా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. భర్తగా చెబుతున్న రాజ్ తరుణ్‌ని ఇంట్లో నుంచి తరిమేసి , ఆయనని అసభ్యపదజాలంతో దూషించావంటూ లావణ్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

లావణ్య డ్రగ్స్ అమ్మినట్లుగా శేఖర్ భాషా ఆరోపించడంతో ప్రూఫ్స్ చూపించాలని ఆమె నిలదీశారు. ఏమీ లేకుండా ఓ ఆడపిల్లను 45 రోజుల పాటు చంచల్ గూడ జైల్లో పెట్టరు కదా అని శేఖర్ వ్యాఖ్యానించారు. దీనికి లావణ్య స్పందిస్తూ మీ వల్ల గీతా అనే అమ్మాయి సూసైడ్ చేసుకుందని, పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ రిజస్టర్ అయ్యిందని ఆరోపించింది. అసలు సంబంధం లేకుండా తమ జీవితాల్లోకి ఎందుకు వస్తున్నావని శేఖర్‌ను లావణ్య ప్రశ్నించింది. నువ్వొక పెయిడ్ ఆర్టిస్ట్‌వని .. రాజ్ తరుణే ఆ ఇల్లు ఇస్తానని అన్నా, వద్దు అనుకుని ఫైట్ చేస్తున్నానని లావణ్య సదరు ఆడియో క్లిప్‌లో వ్యాఖ్యానించింది.

ప్రస్తుతం ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అసలు శేఖర్ భాష ఎవరు, రాజ్‌తరుణ్‌తో అతనికి సంబంధం ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అన్నింటిలోకి లావణ్య ఆరోపించిన గీత ఎవరు , ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుంది అంటూ చర్చ జరుగుతోంది. గతంలో రాజ్ తరుణ్ సైతం తన ఇంటిని కొట్టేయడానికే లావణ్య ఇంత డ్రామా ఆడుతోందని మీడియాతో చెప్పారు.. ఇప్పుడు శేఖర్ సైతం అదే రకమైన ఆరోపణలు చేయడం దుమారం రేపుతోంది. అసలు లావణ్యకు ఏం కావాలి..? ఏం చేస్తే ఆమె తన పోరాటాన్ని విరమిస్తుంది అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

More from Filmibeat

Read more about: rj sekhar basha raj tarun lavanya
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X