రాజ్ తరుణ్ కేసులో మరో ఊహించని మలుపు.. పోలీసులకే షాకిచ్చిన యంగ్ హీరో

తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య కాలంలో సెన్సేషన్ అయిన అంశాల్లో హీరో రాజ్ తరుణ్ కేసు ఒకటి. ఈ యంగ్ హీరో తనను మోసం చేశాడని లావణ్య అనే అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అందే సమయంలో మరో హీరోయిన్ మాల్వి మల్హోత్రాపైన కూడా ఆమె కంప్లైంట్ చేసింది. అప్పటి నుంచి ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. దీంతో ఎన్నో నమ్మలేని నిజాలు కూడా బయటకు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా రాజ్ తరుణ్ కేసులో ఊహించని మలుపు చోటు చేసుకుంది. అసలేం జరిగింది? ఆ పూర్తి వివరాలను మీరే చూసేయండి!

రాజ్ తరుణ్‌ కేసుతో సంచలనం
టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్‌కు ఓ యువతి కోలుకోలేని షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే కెరీర్ పరంగా చాలా ఇబ్బందులు పడుతోన్న అతడిపై లావణ్య అనే ఓ అమ్మాయి హైదరాబాద్ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు సదరు యువతి రాజ్ తరుణ్ తనను మోసం చేశాడని పోలీసులను ఆశ్రయించడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం అయింది.

Hero Raj Tarun Not Attends Police Interrogation

అతడిపై, హీరోయిన్‌పై ఫిర్యాదు
లావణ్య పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో '11 ఏళ్లుగా రాజ్‌తరుణ్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నాను. కానీ, తన సినిమాలో నటిస్తున్న ఓ హీరోయిన్‌తో అఫైర్‌ పెట్టుకొని ఇప్పుడు రాజ్ తరుణ్ నన్ను వదిలేశాడు. ఇప్పుడు చంపేస్తానని నన్ను బెదిరిస్తున్నారు' అంటూ కేసు పెట్టింది. అదే సమయంలో హీరోయిన్ మాల్వీ మల్హోత్రాపైన కూడా ఫిర్యాదు చేయగా ఆమెపైనా కేసు నమోదైంది.

రాజ్ తరుణ్‌కు బిగిసిన ఉచ్చు
లావణ్య పెట్టిన కేసు రోజుకో మలుపు తిరుగుతూ వస్తోంది. మొదట్లో ఈ కేసుతో రాజ్ తరుణ్‌కు ఎలాంటి సంబంధం లేదు అన్నట్లుగా వార్తలు వచ్చాయి. కానీ, ఆ తర్వాత సదరు అమ్మాయి సరైన ఆధారాలను తీసుకు వచ్చి పోలీసులకు అప్పగించింది. దీంతో ఈ కేసులో రాజ్ తరుణ్ చుట్టూ ఉచ్చు బిగిసింది. ఫలితంగా అతడిపై కేసు నమోదు అవడంతో పాటు చిక్కులు ఎదురయ్యాయి.

Hero Raj Tarun Not Attends Police Interrogation

పోలీసులకే షాకిచ్చేసిన హీరో
టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ కేసులో తరచూ ట్విస్టులు కనిపిస్తూనే ఉన్నాయని చెప్పాలి. ఈ క్రమంలోనే తాజాగా అతడు పోలీసులకు షాకిచ్చాడు. వాస్తవానికి ఈరోజు అతడు పోలీసుల విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ, రాజ్ తరుణ్ దీనికి గైర్హాజరు అయ్యాడు. అంతేకాదు, తన లాయర్ ద్వారా ఇప్పుడు విచారణకు రాలేనని అతడు సందేశాన్ని పంపించాడు.

మళ్లీ నోటీసులు ఇవ్వాలంటూ
పోలీసులు నోటీసులు ఇచ్చినా రాజ్ తరుణ్ హాజరు కాకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. అదే సమయంలో దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మరోసారి అతడికి నోటీసులు ఇవ్వాలని పోలీసులు డిసైడ్ అయినట్లు తాజాగా న్యూస్ వైరల్ అవుతోంది. అదే జరిగితే రాజ్ తరుణ్ కచ్చితంగా రావాల్సి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.

More from Filmibeat

Read more about: raj tarun lavanya malvi malhotra
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X