హీరో రాజ్ తరుణ్‌తో.. పెళ్లైంది కానీ .. No కహాని..
తెలుగు ప్రేక్షకులు కంటెంట్ ప్రధానంగా వచ్చే సినిమాలను ఆదరిస్తున్న నేపథ్యంలో బలమైన కథతో వినోదాత్మకంగా రూపొందుతున్న చిత్రం పెళ్లైంది కానీ .. No కహాని. మై 3 సినిమాస్ బ్యానర్‌పై రూపొందుతున్న చిత్రానికి ఏడుకొండలు తాడిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీహరి, స్మిత, అన్నపూర్ణమ్మ, శ్రీలక్ష్మి, చమ్మక్ చంద్ర, కిర్రాక్ ఆర్పీ, రెడ్డి, సత్యశ్రీ, శాంతి కుమార్, జగన్మోహన్ రావు తదితరులు నటిస్తున్నారు.
ఈ చిత్రానికి పనిచేసే సాంకేతిక విభాగాల వివరాల్లోకి వెళితే.. సినిమాటోగ్రఫి: ఆనంద్ మరుకుర్తి, ఎడిటింగ్: శిరీష్ ప్రసాద్, మ్యూజిక్: బాలు కే లయరాగ్, వీఎఫ్ఎక్స్: టింట్ వీఎఫ్ఎక్స్, సోమేష్ యెరిపల్లి, కొరియోగ్రఫి: నగేష్ తమ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ ఆవిష్కరణ, పోస్టర్ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. యువ హీరో రాజ్ తరుణ్ చేతుల మీదుగా పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్ఎక్స్ అధినేత పద్మనాభరెడ్డి, దర్శకుడు ఏడు కొండలు, నటుడు జగన్మోహర్ రావు తదితరులు పాల్గొన్నారు.

పెళ్లైంది కాని No కహానీ టైటిల్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఈ మూవీ పోస్టర్ ఆవిష్కరించడం చాలా హ్యాపీగా ఉంది. దర్శకుడు ఈ సినిమాను ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించారు. ప్రస్తుతం తెలుగులో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ ట్రెండ్ నడుస్తున్నది. ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకొంటున్నాను అని హీరో రాజ్ తరుణ్ అన్నారు.
ఈ సినిమా చాలా బాగా వచ్చింది. మరో నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. ఫ్యామిలీ ఆడియెన్స్ అందరూ ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుంది అని హీరో శ్రీహరి అన్నారు. ఐఎఫ్ఎక్స్ అధినేత పద్మనాభరెడ్డి మాట్లాడుతూ చిత్ర యూనిట్‌కు ఘన విజయం లభించాలి. అందరికీ నా బెస్ట్ విషెస్ అని అన్నారు. నటుడు జగన్మోహన్ రావు, డైరెక్టర్ ఏడుకొండలు తాడిశెట్టి ఈ సినిమా కంటెంట్, విజయంపై విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications