బర్త్‌డే బాయ్ - రాజా
ఓ చిన్నదాన, విజయం చిత్రాల్లో నటించినా ఆనంద్ చిత్రం విజయంతో ఎ క్లాస్ హీరోగా రాజా గుర్తింపు పొందారు. నవంబర్ 9 (గురువారం) ఆయన పుట్టినరోజు. నటుడయ్యాక అభిమానుల సమక్షంలో జరుపుకునే తొలి పుట్టినరోజు ఇదేనని రాజా చాలా సంతోషంగా చెప్పారు. రాజా అభిమానులు వరంగల్‌లో ఆయన పుట్టినరోజు సందర్భంగా పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరం కూడా నిర్వహిస్తున్నారు.
ఈ సంవత్సరం హీరోగా నాలుగు సినిమాలు చేశాను. వెన్నెల, స్టయిల్, కోకిల, బంగారం.. నా కెరీర్‌కి ఈ నాలుగు సినిమాలూ దోహదం చేశాయి. అయితే, ఆనంద్ తర్వాత మళ్లీ అంతటి గుర్తింపు మాత్రం త్వరలో విడుదలవుతున్న మాయాబజార్ చిత్రం ద్వారా వస్తుందన్న నమ్మకం ఉంది అంటున్నారు రాజా. అలాంటి పాత్ర కోసం చాలా కాలం నిరీక్షించాను. నా కష్టానికి తగిన ఫలితం తొందరలోనే రాబోతోందని మాత్రం చెప్పగలను అన్నారు.
దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ మాయాబజార్‌ని చాలా చక్కగా, అందంగా తీర్చిదిద్దారన్నారు. ఆ సినిమాలో నాలుగు ఫైట్స్ కూడా ఉన్నాయి. యాక్షన్ హీరోగా నాకు గుర్తింపు కూడా రావచ్చు. ప్రేక్షకుల తీర్పు ముఖ్యం కానీ ఈ సినిమా చేస్తున్నప్పుడు యావత్ యూనిట్ సభ్యులంతా నా పెర్ఫార్మెన్స్‌కి మెచ్చుకున్నారు. అదే చాలా ఆనందాన్ని ఇస్తోంది అని చెప్పారు.
బంగారంలో పవన్ కల్యాణ్‌తోనూ, మహేశ్‌బాబుతో అర్జున్ చిత్రంలోనూ చేశాను. అలాగే ఇతర హీరోలతో చేయడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాను అన్నారు రాజా.
ఈ మధ్యనే రాజా తన సంపాదనలో 40 శాతం పేదప్రజలకు అందించే ఉద్దేశంతో ఒక ఛారిటీ సంస్థను కూడా ప్రారంభించారు. ఇప్పుడిప్పుడే ఈ కార్యక్రమాలు మొదలుపెట్టాను. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు ప్రారంభించాలన్నది నా కోరిక. దేవుడి దయ, అభిమానుల అండ ఉన్నంత కాలం నా పయనం ముందుకే సాగుతుందని రాజా అన్నారు.


Click it and Unblock the Notifications