చంపేస్తమంటూ హీరో రాజాకు..
భద్రత కోసం పోలీసులను సంప్రదించటానికి వస్తే సినీ హీరో రాజాకు చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ వచ్చాయని అంతటా పుకార్లు షికార్లు చేసాయి. ఈ సంఘటన హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో చోటు చేసుకుంది. రాజా ఇక్కడ పోలీస్ స్టేషన్ కి రావటంతో ఈ గందరగోళం చోటు చేసుకుంది.ఈ విషయాన్ని కొన్ని టీవీ ఛానెల్స్ వారు తప్పుగా అర్ధం చేసుకుని ఎస్.ఎమ్.ఎస్ ల ద్వారా బెదిరింపులు వస్తే పిర్యాదు చేసేందుకు వచ్చారని స్క్రోరింగ్ ఇవ్వడంతో పెద్ద సంఖ్యలో మీడియా ప్రతినిధులు స్టేషన్ ప్రాగణానికి చేరుకున్నారు. ఈ విషయమై రాజాని వివరణ కోరగా వ్యక్తిగత రక్షణ కోసం ఆయుధం తీసుకునేందుకు కావాల్సిన వివరాలను తెలుసుకునేందు మాత్రమే తాను ఇక్కడకు వచ్చానని చెప్పారు. మీడియాలో వచ్చిన కథనం వాస్తవం కాదని ఖండించారు. పలు సందర్బంగా తప్పుడు స్క్రోలింగ్ ఇస్తున్న మీడియా పట్ల పోలీసు అధికారకులు అసహనాన్ని వ్యక్తం చేసారు.
raja weapon license police black mail calls hyderabad jubliee hills media రాజా బెదిరింపు కాల్స్ హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ టీవీ ఛానెల్స్


Click it and Unblock the Notifications