twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కులుమనాలిలో రాజశేఖర్‌కు ప్రమాదం అంటూ రూమర్స్.. కల్కి టీం సేఫ్, ఏం జరిగిందంటే!

    |

    పీఎస్‌వీ గరుడవేగతో మంచి విజయం అందుకున్న సీనియర్ హీరో రాజశేఖర్ తాజాగా కల్కి అనే చిత్రంలో నటిస్తున్నారు. అ! చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి దర్శకుడు. వైవిధ్యమైన కథతో భారీ స్థాయిలో ఈ చిత్రం రూపొందింది. తనలో ఇంకా సత్తా తగ్గలేదని గరుడవేగ చిత్రంతో నిరూపించుకున్న రాజశేఖర్ కల్కి రూపంలో మరో సాహసోపేతమైన చిత్రాన్ని ఎంచుకున్నారు. తన గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై రాజశేఖర్ క్లారిటీ ఇచ్చారు. రూమర్స్ స్ప్రెడ్ చేయవద్దని అభిమానులని, మీడియాని కోరుతూ ఓ లెటర్ విడుదల చేశారు. అసలింతకీ ఎం జరిగిందో ఇప్పుడు చూద్దాం!

    కులుమనాలిలో రాజశేఖర్‌కు ప్రమాదం అంటూ

    కులుమనాలిలో రాజశేఖర్‌కు ప్రమాదం అంటూ

    కులుమనాలిలో జరిగిన ప్రమాదంలో హీరో రాజశేఖర్ గాయపడ్డారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. షూటింగ్ జరుగుతుండగా ప్రమాదానికి గురయ్యారని పెద్ద ఎత్తున వార్త వ్యాపించింది. దీనిపై తాజాగా రాజశేఖర్ స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. పుకార్లు సృష్టించి గందరగోళం చేయవద్దని అన్నారు.

    గాయపడ్డది నిజమే కానీ

    గాయపడ్డది నిజమే కానీ

    తనకు ప్రమాదం జరిగిందంటూ వస్తున్న ప్రచారంపై స్పందించిన రాజశేఖర్ అసలు విషయాన్ని వివరించారు. పది రోజుల క్రితం కల్కి షూటింగ్ జరుగుతుండగా గాయపడ్డాను. షూటింగ్ లో చాలా మంది నటీనటులు భాగం కావడంతో గాయంతోనే నటించాల్సి వచ్చింది. ఇప్పుడు నాకు పరవాలేదు. గాయం కాస్త తగ్గింది అని రాజశేఖర్ తెలిపారు. కొత్త షెడ్యూల్ కోసం కులుమనాలి వెళుతున్నాం అని పేర్కొన్నారు.

    కులుమనాలి వెళుతుండగా

    తనతో పాటు ఫ్యామిలీ, కల్కి చిత్ర యూనిట్ అంతా కులుమనాలి వెళుతుండగా మధ్యలో కొండా చరియలు విరిగి పడ్డాయి. కానీ మాకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. మేమంతా సేఫ్ గానే ఉన్నాం. కొంత సమయం ఆగి మళ్ళీ మా ప్రయాణాన్ని ప్రారంభించాం. అందమైన కులుమనాలి లొకేషన్లలో కల్కి చిత్ర షూటింగ్ కోసం ఆసక్తిగా ఉన్నా.

    పాత ఫోటోలు

    పాత ఫోటోలు

    తనకు కులుమనాలిలో ప్రమాదం జరిగిందని వార్తలు వచ్చినప్పటి నుంచి చాలా ఫోన్స్, మెసేజ్ లు వస్తున్నాయి. కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు నాకోసం ఆరాతీస్తున్నారు. వారందరి ప్రేమ, అభిమానులకు కృతజ్ఞతలు. మొత్తంగా జరిగిన వాస్తవం ఇది. ఇకపై నా గురించి ఎవరూ రూమర్స్ స్ప్రెడ్ చేసి గందరగోళం సృష్టించవద్దు. పాత ఫోటోలు జతచేసి పోస్ట్ లు పెట్టవద్దని రాజశేఖర్ సోషల్ మీడియా ద్వారా అభిమానులని కొరారు.

    English summary
    Hero Rajasekhar gives clarity about on going rumours. Here is the details
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X