twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కరోనా భారిన పడిన హీరో రాజశేఖర్ ఫ్యామిలీ.. పరిస్థితి ఎలా ఉందంటే

    |

    కరోనా వైరస్ తో గత ఏడు నెలల నుంచి ఎంతో జాగ్రత్తగా ఉంటున్న వారు కూడా ఇప్పుడు వైరస్ కారణంగా తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఎంత కేర్ఫుల్ గా ఉన్నా కూడా ఏదో ఒక చిన్న పొరపాటు వలన వైరస్ కొన్ని సార్లు తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఇక టాలీవుడ్ సెలబ్రెటీలలో ఇప్పటికే కొంతమంది కరోనాను దాటి షూటింగ్స్ లతో బిజీ అయ్యారు. కానీ మరికొందరి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని కూడా మిగిల్చింది. ఇక సీనియర్ హీరో రాజశేఖర్ కుటుంబం కూడా కరోనా భారిన పడింది.

    రాజశేఖర్ ఫ్యామిలీలో కరోనా

    రాజశేఖర్ ఫ్యామిలీలో కరోనా

    రాజశేఖర్ ఫ్యామిలీ మొత్తం కూడా కరోనా వైరస్ భారిన పడినట్లు క్లారిటీ ఇచ్చారు. ట్విట్టర్ ద్వారా స్పందించిన ఈ సీనియర్ హీరో ఇటీవల మా ఫ్యామిలీ సబ్యులకు కరోనా పరీక్షల్లో పాజిటివ్ తేలిందని చెబుతూ ఇప్పటికే తన కూతుళ్లు శివాని, శివాత్మిక కోలుకున్నట్లు తెలిపారు. అయితే తాను జీవిత ఇప్పుడిప్పుడే కొలుకుంటున్నట్లు వివరణ ఇచ్చిన రాజశేఖర్ త్వరలోనే ఇంటికి చేరుకుంటామని అన్నారు..

    హాస్పిటల్ లో జీవిత రాజశేఖర్

    హాస్పిటల్ లో జీవిత రాజశేఖర్

    గత కొన్ని రోజుల క్రితం ఇంట్లో నలుగురికి కూడా దగ్గు జ్వరం ఉండడంతో రాజశేఖర్ వెంటనే హాస్పిటల్ లో జాయిన్ చేయించారు. కరోనా పరీక్షలు నిర్వహించడంతో పాజిటివ్ అని రాగానే ఇన్ని రోజులు హాస్పిటల్ లోనే చికిత్స తీసుకున్నారు. ఇక ఫైనల్ గా శివాని, శివాత్మిక వైరస్ నుంచి బయటపడ్డారు. ఇక రాజశేఖర్, జీవితం హాస్పిటల్ లోనే చికిత్స తీసుకుంటున్నారు. వారి త్వరగా ఇంటికి చేరుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

     ప్లాస్మా డోనేషన్..

    ప్లాస్మా డోనేషన్..

    గతంలో రాజమౌళి, కీరవాణి కుటుంబ సభ్యులు కూడా కరోనా వైరస్ భారిన పడిన విషయం తెలిసిందే. అయితే వైరస్ మొదటి దశలో ఉండగానే వాళ్ళంతా హోమ్ క్వారంటైన్ లోనే డాక్టర్ల సలహా మేరకు ట్రెట్మెంట్ తీసుకున్నారు. ఇక కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న తరువాత వారు ప్లాస్మా కూడా డొనేట్ చేశారు. అదే తరహాలో రాజశేఖర్ ఫ్యామిలీ కూడా పూర్తిగా కోలుకున్న తరువాత ప్లాస్మా డొనేట్ చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

    Recommended Video

    Keerthy Suresh's Aina Ishtam Nuvvu: Natti Kumar Slams Chanti Addala
    రిస్క్ చేయకూడదని.. దూరంగా ఉంటున్న సీనియర్లు

    రిస్క్ చేయకూడదని.. దూరంగా ఉంటున్న సీనియర్లు

    కరోనా వైరస్ విషయంలో సినీ తారలు ఇప్పుడు మరింత సీరియస్ గా ఉన్నారు. ఇటీవల ఎస్పీ.బాలసుబ్రహ్మణ్యం కరోనా కారణంగా నెల రోజులకు పైగా హాస్పిటల్ లోనే ఎంతగానో పోరాటం చేశారు. కానీ చివరికి ఇతర ఆరోగ్య సమస్యలపై ప్రభావం చూపడంతో తుది శ్వాస విడిచారు. ఈ ఘటన అనంతరం సీనియర్ హీరోలు, సినీ ప్రముఖులు షూటింగ్ లకు బయట ప్రపంచానికి చాలా దూరంగా ఉంటున్నారు.

    English summary
    Rajashekar said that the family is currently being treated at a hospital. In a relieving update, Rajasekhar said that both his daughters, Shivani and Shivathmika, have recovered and are completely out of the virus. He went on to say that he and Jeevitha are feeling much better and will be back home soon.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X