తేజ నా భార్య క్లాస్ మేట్, కథ మార్చనన్నాడు, అందుకే వదిలేసా: ఆ రహస్యం గుట్టు విప్పిన రాజశేఖర్

తేజా "అహం" పేరుతో "నేనే రాజూ నేనే మంత్రి" కథ ముందు నాకే చెప్పాడు. అది చాలా బాగా వచ్చింది. క్లైమాక్స్ ముందు వరకు నాకు చాలా నచ్చింది. ఐతే క్లైమాక్స్ దగ్గర మా ఇద్దరికి ఏకాభిప్రాయం కుదరలేదు.

రానా కి నటుడిగా గుర్తింపు ఉన్నా నేనే రాజు నేనే మంత్రి వరకూ హీరోగా నిలబెట్టిన హిట్ ఒక్కటి కూడా లేదు. ఘాజీ హిట్ అనే అనుకున్నా ఆ క్రెడిట్ మొత్తం ఆ సినిమా డైరెక్ట్ర సంకల్ప్ రెడ్డి ఖాతాలోకే వెళ్ళిపోయింది. మరో పక్క వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న తేజ అదే సమయం లో నేనే రాజు.. కథ తో సురేష్ బాబు దగ్గరికి రావటం దానుఇలో రానాని హీరోగా పెట్టటం జరిగిపోయాయి. అటు రానా కీ ఇటు తేజా కీ ఆ సినిమా మంచి బ్రేక్ ఇచ్చింది.

Recommended Video

బాలకృష్ణ చేతులమీదుగా గరుడవేగ ట్రైలర్..
రాజశేఖర్-తేజ మధ్య విభేదాల కారణంగా

రాజశేఖర్-తేజ మధ్య విభేదాల కారణంగా

అయితే అప్పట్లో ఒక రూమర్ బాగా వినిపించింది. అదేమిటంటే... ఈ సినిమా కంటే ముందు రాజశేఖర్ హీరోగా 'అహం' అనే సినిమాను ప్లాన్ చేసుకున్నాడనీ. అయితే రాజశేఖర్-తేజ మధ్య విభేదాల కారణంగా ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లలేదనీ. ఆ తరువాత అదే కథను రానా, సురేశ్ బాబులకు వినిపించిన తేజ... వారి సూచనల మేరకు ఇందులో కొన్ని మార్పులు చేసి రానా హీరోగా హిట్ కొట్టాడనీ అనుకున్నారు.

తేజాకీ రాజశేఖర్ కీ వచ్చిన గొడవ ఏమిటీ

తేజాకీ రాజశేఖర్ కీ వచ్చిన గొడవ ఏమిటీ

అయితే అది రూమర్ కాదనీ నిజమే అన్నసంగతి సినిమా ప్రమోషన్స్ సందర్భంగా నిర్మాత సురేశ్ బాబు ఈ విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించడంతో తేలిపోయింది.అయితే అక్కడినుంచీ అసలు అంత మంచి కథని రాజశేఖర్ ఎందుకు వదులుకున్నాడు? అసలు తేజాకీ రాజశేఖర్ కీ వచ్చిన గొడవ ఏమిటీ ? అన్న అనుమానాలు చాలామందికే వచ్చాయి...

 రహస్యంగానే మిగిలిపోయింది

రహస్యంగానే మిగిలిపోయింది

కానీ తేజా, రాజశేఖర్ లలో ఎవరూ ఆ విషయం మీద మాట్లాడకపోవటం తో అది రహస్యంగానే మిగిలిపోయింది... ఇప్పుడు ఆ విస్ఘయానే రాజశేఖర్ బయట పెట్టాడు. అసలు ఆనాటి "అహం" కథ ఎలా తననుంచి జారిపోయిందీ, అసలు ఇద్దరి మధ్యా జరిగింది గొడవా లేజ్క చిన్న అభిప్రాయ భేదమా అన్న విస్ఝయాన్ని ఇన్నాళ్ళకి తానే చెప్పాడు ఈ నిన్నటి యాంగ్రీ యంగ్‌మాన్ రాజశేఖర్..

ఆ రకంగా కూడా అతను నాకు క్లోజ్

ఆ రకంగా కూడా అతను నాకు క్లోజ్

"తేజ గారు ఆ కథ ముందు నాకే చెప్పిన మాట వాస్తవం. నేను ‘వందేమాతరం' సినిమా చేస్తున్నప్పటి నుంచి తేజ నాకు తెలుసు. ఆ సినిమాకు కెమెరా అసిస్టెంటుగా పని చేశాడతను. నా భార్య జీవితకు తేజ క్లాస్ మేట్ కూడా. ఆ రకంగా కూడా అతను నాకు క్లోజ్. తేజను డైరెక్షన్ చేయమని ఒత్తిడి చేసిన వాళ్లలో నేనూ ఒకడిని.

 మా ఇద్దరికి ఏకాభిప్రాయం కుదరలేదు

మా ఇద్దరికి ఏకాభిప్రాయం కుదరలేదు

అతను ‘అహం' పేరుతో నాకు కథ చెప్పాడు. అది చాలా బాగా వచ్చింది. క్లైమాక్స్ ముందు వరకు నాకు చాలా నచ్చింది. ఐతే క్లైమాక్స్ దగ్గర మా ఇద్దరికి ఏకాభిప్రాయం కుదరలేదు. నేనొకలా ఉండాలన్నాను. అతను ఒకలా రాశాడు. ఇలా అయితే నేను చేయనని చెప్పాను. ఇంకో హీరోతో చేయమని నేనే మామూలుగా చెప్పాను. అతను అలాగేనని రానాతో సినిమా చేశాడు'' అని రాజశేఖర్ అన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X