ముఖ్యంగా లేడీస్ కి చాలా థాంక్స్: రాజశేఖర్
"కథ విన్నప్పుడే సినిమా మంచి విజయం సాధిస్తుందని వూహించాను. మా నమ్మకం నేడు నిజమైంది. 'మా అన్నయ్య బంగారం'కి బ్రహ్మాండమైన కలెక్షన్లు వస్తున్నాయనీ హీరో రాజశేఖర్ అన్నారు. కమిలినీ ముఖర్జీ హీరోయిన్ గా చేసిన 'మా అన్నయ్య బంగారం' జూలై 31న విడుదలైంది. హైదరాబాద్ లో ప్రసాద్ ప్రివ్యూ థియేటర్ లో సక్సెస్ మీట్ఏర్పాటు చేసారు. రాజశేఖర్ మాట్లాడుతూ"ముఖ్యంగా లేడీస్ కి చాలా థాంక్స్. ఎక్కువ సంఖ్యలో లేడీస్ తమ కుటుంబాలతో వెళ్లడం వల్లే గతంలో నా ఫ్యామిలీ సినిమాలు హిట్టయ్యాయి. వాళ్లకి ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలీడం లేదు. వాటి సరసన 'మా అన్నయ్య బంగారం' నిల్చుంటుందని అందరూ అంటున్నారు. కథలోని భావోద్వేగాలు ప్రతి ఒక్కర్నీ కదిలిస్తాయి. మహిళా ప్రేక్షకులకు నచ్చింది. ఉమ్మడి కుటుంబాల్లోని మమకారాల గొప్పదనమేంటో మా సినిమాలో చూపించామని చెప్పారు. విశాఖ టాకీస్ పతాకంపై నట్టి కుమార్ నిర్మించిన ఈ చిత్రంలో అయితే సెంటిమెంట్ మరీ ఓవర్ అయిపోయిందని టాక్ వచ్చింది. అందుకు తగ్గట్లే జనం కూడా ధియోటర్స్ లో పెద్దగా కనపడటం లేదు.


Click it and Unblock the Notifications











