twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫెయిల్యూర్‌లో ఉంటే ముఖం చాటేస్తారు.. 'కల్కి' కోసం 100 కథలు విన్నా .. రాజశేఖర్!

    |

    దర్శకరత్న దాసరి నారాయణరావు పేరు మీద దాసరి ఫిలిం అవార్డ్స్ వేడుకని బుధవారం రోజు నిర్వహించారు. ఈ వేడుకకు ఆర్ నారాయణ మూర్తి, వివి వినాయక్, రాజశేఖర్, జెర్సీ చిత్ర దర్శకుడు గౌతమ్ తిన్ననూరి, పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హాజరయ్యారు. మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రాజశేఖర్, వివి వినాయక్, తమ్మారెడ్డి మాట్లాడుతూ దాసరిపై ప్రశంసలు కురిపించారు. తెలుగు చిత్రపరిశ్రకు ఆయన చేసిన సేవలని గుర్తు చేసుకున్నారు.

    అందరి సమస్యలని

    అందరి సమస్యలని

    రాజశేఖర్ మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో ఎలాంటి సమస్య ఎదురైనా దాసరి నారాయణరావు గారే పరిష్కరించేవారు అని అన్నారు. అందరిని తనవారుగా భావించేవారు అని అన్నారు. కానీ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం పరిస్థితి సరిగా లేదని రాజశేఖర్ అన్నారు. ఓ వ్యక్తి ఫెయిల్యూర్ లో ఉంటే తెలిసిన వాళ్ళు కూడా మాట్లాడడానికి ఇష్టపడడం లేదు. ముఖం చేటేసి వెళ్లిపోతున్నారు అని రాజశేఖర్ వ్యాఖ్యానించారు.

     కథలు లేవు

    కథలు లేవు

    దాసరి నారాయణరావు దేశం గర్వించదగ్గ దర్శకులు. కానీ ప్రస్తుతం వస్తున్న దర్శకులలో మంచి చిత్రాలు చేయాలనే తపన లేదు అని అన్నారు. కథలు కూడా దొరకడం లేదు. గరుడవేగ తర్వాత నేను 100 కథలు విన్నా. చివరకు కల్కి కథ నచ్చింది అని రాజశేఖర్ తెలిపారు. అందుకే గరుడవేగ తర్వాత సినిమా ప్రారంభించడానికి ఆలస్యం అయింది. కానీ చిత్రాన్ని మాత్రం కేవలం 74 రోజుల్లో పూర్తి చేశాం అని రాజశేఖర్ తెలిపారు.

    ఇంటికి వెళ్లనంటూ ఏడ్చాడు.. చెప్పలేని పరిస్థితి.. డైరెక్టర్ క్రిష్‌తో నాని!ఇంటికి వెళ్లనంటూ ఏడ్చాడు.. చెప్పలేని పరిస్థితి.. డైరెక్టర్ క్రిష్‌తో నాని!

     ఆయన దర్శకుడు ఏంటి అనుకున్నా

    ఆయన దర్శకుడు ఏంటి అనుకున్నా

    తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. దాసరి నారాయణరావు గారిని తాను తొలిసారి తాత మనవడు చిత్రం సందర్భంగా చూశానని తెలిపారు. ఆ సమయంలో ఈయన దర్శకుడు ఏంటి అని అనుకున్నా. ఆ తర్వాత టాలీవుడ్ లో చరిత్ర సృష్టించిన దర్శకుడిగా నిలిచారు. దాసరి ఫిలిం అవార్డుని పూరి జగన్నాథ్, గౌతమ్ తిన్ననూరి, ఆర్ నారాయణ మూర్తి దక్కించుకున్నారు. దాసరి తరహలోనే ఆర్ నారాయణ మూర్తి, పూరి జగన్నాథ్ ట్రెండ్ సెట్ చేసిన దర్శకులు అని ప్రశంసించారు.

    దాసరి ఒక వ్యవస్థ

    దాసరి ఒక వ్యవస్థ

    మాస్ చిత్రాల దర్శకుడు వివి వినాయక్ మాట్లాడుతూ.. దాసరి నారాయణ రావు ఒక వ్యక్తి కాదు.. వ్యవస్థ అని వినాయక్ అన్నారు. ఎందరో నటులు, దర్శకులు ఆయన నుంచి వచ్చినవారే అని వివి వినాయక్ ప్రశంసించారు. మాజీ ముఖ్యమంత్రి రోశయ్య అవార్డులు గెలుచుకున్నవారి పేర్లని ప్రకటించారు. ఈ వేడుకకు పూరి జగన్నాథ్ కు బదులుగా ఆయన కుమారుడు ఆకాష్ పూరి హాజరయ్యాడు.

    English summary
    Hero Rajasekhar Speech at Dasari Film Awards Function
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X