For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కాకి పిల్ల కాకికి ముద్దు, విజయ్ దేవరకొండ లాంటి వాళ్లతో పోటీ పడతా: రాజశేఖర్

|

రాజశేఖర్ కూతురు శివాత్మిక త్వరలో 'దొరసాని' అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఆమెకు జోడీగా ఆనంద్ దేవరకొండ నటిస్తున్నాడు. కెవిఆర్ మహేంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రం జులై 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజశేఖర్ ఆసక్తికరంగా ప్రసంగించారు.

నేను 30 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను. కానీ స్టేజీపై మాట్లాడుతుంటే నర్వస్ ఫీలవుతుంటాను. కానీ విజయ్ దేవరకొండ స్టేజ్ ఫియర్ లేకుండా చాలా ప్రశాంతంగా మాట్లాడారు. ఆయనలా మాట్లాడటం నేను కూడా అలవాటుచేసుకుంటాను. ఆయన చెప్పే మాటలు విన్న తర్వాత నాలో కూడా ధైర్యం వచ్చింది అన్నారు.

నేను తప్పించుకునే వాడిని, జీవిత తిట్లు తినేది

నేను తప్పించుకునే వాడిని, జీవిత తిట్లు తినేది

చిన్నతనం నుంచి నా ఇద్దరు కూతుళ్లతో చాలా క్లోజ్ రిలేషన్ ఉంది. ఔట్ డోర్ షూటింగుకు వెళితే వారిని కూడా తీసుకెళతాను. వాళ్లు స్కూలు ఎగ్గొడుతుండటంతో టీచర్లు జీవితను తిట్టేవారు. అలాంటి సమయంలో నేను తిట్లు తినకుండా దూరంగా ఉండేవాడిని. ఇదో సమస్య కావడంతో మా ఇద్దరు పిల్లల కోసం నేనే స్కూలు పెట్టాను.

ఈ ఫీల్డులో టాలెంట్ ఉందా? లేదా? అనేది చూడరు...

ఈ ఫీల్డులో టాలెంట్ ఉందా? లేదా? అనేది చూడరు...

మా పిల్లలకు సినిమాల్లోకి రావాలని చిన్నప్పటి నుంచికోరిక. వారికి నేను ఎప్పుడూ ఒకటే విషయం చెప్పేవాడిని, సినిమా ఫీల్డ్‌లో నెగ్గుకు రావడం కష్టం. నేను 30 ఏళ్లుగా ఉన్నాను. సక్సెస్ ఉన్నంత వరకు అంతా బావుంటుంది. సక్సెస్ లేక పోయేసరికి చాలా మంది డిప్రెషన్లోకి వెళ్లిపోతారు. నా పిల్లల విషయంలో అదే భయం. ఈ ఫీల్డులో టాలెంట్ ఉందా? లేదా? అనేది చూడరు. సక్సెస్ ఉంటేనే మనకు అవకాశాలు ఉంటాయి. ఇక్కడ మనం సర్వైవ్ కాలేక పోతే పరిస్థితి ఏమిటి? అనేది చూసుకోవాలి. సినిమా రంగం ప్లాన్ ‘ఎ' అయితే.. ఇక్కడ సక్సెస్ కాకపోతే ఏమిటని ప్లాన్ ‘బి' ఉండాలి.

చివరి రోజు వరకు ఇదే ఫీల్డులో, విజయ్ దేవరకొండ లాంటి వాళ్లు ఎంత మంది వచ్చినా...

చివరి రోజు వరకు ఇదే ఫీల్డులో, విజయ్ దేవరకొండ లాంటి వాళ్లు ఎంత మంది వచ్చినా...

నేను కూడా సినిమాలు లేక పోతే బాధపడతాను. ఇక్కడ సర్వైవ్ అయ్యే పరిస్థితి లేక పోతే వెళ్లి డాక్టర్‌గా ప్రాక్టీస్ చేయగలను. కానీ నేను అలాంటి పరిస్థితి ఎదురు చూడలేదు. వెళ్లే ఉద్దేశ్యం కూడా లేదు. ఎలాగైనా నా చివరి రోజు వరకు ఇదే ఫీల్డులో ఉంటాను. విజయ్ దేవరకొండ లాంటి వారు ఎంత మంది వచ్చినా వారితో పోటీ పడుతూనే ఉంటాను.

కాకి పిల్ల కాకికి ముద్దు

కాకి పిల్ల కాకికి ముద్దు

నా ఇద్దరు కూతుళ్లు ఇండస్ట్రీలో పాసైపోతారనే నమ్మకం ఉంది. శివాత్మికను చూసి గర్వపడుతున్నాను. శివాత్మిక మాత్రమే కాదు... శివాని కూడా వెరీ టాలెంటెడ్. కాకిపిల్ల కాకికి ముద్దు... కాదు కాదు వారు పికాక్స్. ఇపుడు ఈ మాట అనలేదంటే ఇంటికి వెళ్లిన తర్వాత మమ్మల్ని కాకి అన్నావని తిడతారు. అందుకే పికాక్ పిల్లలు పికాక్‌కు ముద్దు. నా పిల్లలకు మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను.

నాకు షో చేసే హీరోలు నచ్చరు, ఈ ఇద్దరు అన్నదమ్ముల్లో అది లేదు

నాకు షో చేసే హీరోలు నచ్చరు, ఈ ఇద్దరు అన్నదమ్ముల్లో అది లేదు

ఆనంద్ దేవరకొండ, నేనుక్లాస్ మేట్స్. మేము క్లాస్ మేట్స్ అంటే మరోలా అర్థం చేసుకోవద్దు. ఇద్దరం కలిసి అప్పుడప్పు మెడిసిన్ చదువుకుంటాం. ఆనంద్ వండర్ ఫుల్ బాయ్, మంచి డాన్సర్. మీ అందరికీ తెలియని విషయం సినిమాలో బయట పడుతుంది. నాకు షో చేసే హీరోలు అంటే నచ్చరు. కానీ ఈ ఇద్దరు అన్నదమ్ముల్లో అది లేదు. వీరు ఒరిజినల్స్ కింగ్స్.

భయం వేసి ఇంజనీర్లను తీసుకెళ్లి చెక్ చేయించా

భయం వేసి ఇంజనీర్లను తీసుకెళ్లి చెక్ చేయించా

ఈ సినిమా షూటింగ్ కోదాడ గడి అనే 200 ఏళ్ల క్రితం నాటి భవనంలో జరిగింది. చూట్టూ గోడలు కూలిపోయి ఉంది. వీరు షూటింగ్ చేసే భవంతి కూడా ఎప్పుడు కూలిపోతుందో అనే విధంగా ఉంది. అలాంటి చోట 25 రోజులు షూటింగ్ చేశారు. నాకు భయం వేసి ఇంజనీర్లను తీసుకెళ్లి కూడా చెక్ చేయించారు. భూకంపం ఎక్కువగా ఉదయం పూటనే వస్తూ ఉంటుంది. వీళ్లు ఎక్కువగా అదే సమయంలో షూటింగ్ చేశారు.

శివాత్మిక ఒక మామూలు అమ్మాయిలానే

శివాత్మిక ఒక మామూలు అమ్మాయిలానే

నేను కానీ, జీవిత కానీ ఎప్పుడూ షూటింగ్ లొకేషన్ వెళ్లి నా కూతురుకు సపోర్ట్ చేయలేదు. సెలబ్రిటీల పిల్లలకు అంతా స్పెషల్‌గా జరిగిపోతాయి అనుకుంటారు. కానీ శివాత్మిక ఒక మామలూ అమ్మాయిలానే ఈ సినిమాలో చేసిందని రాజశేఖర్ చెప్పుకొచ్చారు.

English summary
Hero Rajasekhar Fantastic Speech At Dorasani Pre Release Event. Dorasaani is a period romantic drama movie in Telangana backdrop in 1980's directed by KVR Mahendra and produced by Yash Rangineni and Madhura Sreedhar.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more