మనిషిగా పుట్టడం గొప్ప.. మనిషిగా బ్రతకడం ఇంకా చాలా గొప్ప: రాజశేఖర్

కళాబంధు, డా.టి.సుబ్బరామిరెడ్డి పుట్టినరోజు (సెప్టెంబర్ 17)ను పురస్కరించుకొని ప్రతియేటా ప్రముఖ నటీనటులకు బిరుదు ప్రధానం చేసి సత్కరిస్తారు. గత 20ఏళ్లుగా ఆనవాయితీగా సాగిస్తున్న ఈ కార్యక్రమం ఈ సంవత్సరం కూడా నిర్వహించారు. ఈక్రమంలోనే ప్రముఖ నటి జయసుధకు టి. సుబ్బరామిరెడ్డి పుట్టినరోజు సంధర్భంగా సెప్టెంబర్ 17వ తేదీన విశాఖపట్నంలో అంగరంగ వైభవంగా కార్యక్రమం నిర్వహించి అభినయ మయూరి బిరుదు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ, రాజీకీయ ప్రముఖులు విచ్చేశారు. సీనియర్ నటి జమున, అలనాటి హీరోయిన్ రాధిక, ఎమ్మెల్యే రోజా, జీవిత, శారద, గాయని పి. సుశీల అలాగే మురళీ మోహన్, రాజశేఖర్, శరత్ కుమార్,బ్రహ్మానందం లతో పాటు ఈ కార్యక్రమంలో టీడీ బోర్డు ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీలు కేవీపీ రామచంద్రరావు, టీజీ వెంకటేష్, రామకృష్ణరాజు, ఎంవీవీ సత్యనారాయణ, ద్రోణంరాజు శ్రీనివాస్, ఎమ్మెల్యేలు గొల్లబాబూరావు, నాగిరెడ్డి, గంటా శ్రీనివాస రావు లతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.

ఈ సంధర్భంగా కళాబంధు సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ.ఇటువంటి కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నాను అంటే.. ఈ కార్యక్రమాలు టీవీల ద్వారా చూసి అందరూ ఆనందిస్తారని ప్రేక్షకుల ఆనందం కోసమే ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రతీ సంవత్సరం పుట్టిన రోజు నాడు ఇటువంటి కార్యక్రమం చేయడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. పుట్టినరోజు ఓ పవిత్రమైన రోజు.. అటువంటి రోజు మనం మన జీవితంలో ఏం సాధించాం.. భవిష్యత్తులో ఏం చేయబోతున్నాం.. అనే విషయాలను గుర్తు చేసుకోవాలని అన్నారు. విశాఖను దత్తత తీసుకుని కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న అన్నీ దేవాలయాల అర్చకులను పిలిపించి ఆశీర్వదించడం.. వాళ్ల చేత ఈ ప్రదేశాన్ని పుణీతం చేయించడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని అన్నారు. కళను అభినందిస్తాను.. కళను ప్రేమిస్తాను.. కళను ఆరాధిస్తాను.. కళకు గౌరవిస్తాను అందుకే కళాకారులకు సత్కారం చేస్తున్నాను అని అన్నారు. శివాజీ గణేషన్, అక్కినేని నాగేశ్వరారావు.. ఇలా ఎందరో నటీనటులను సత్కరించినట్లుగా దాదాపు 46ఏళ్ల పాటు వివిధ పాత్రల్లో జీవించి, పాత్రల్లో లీనం అయిపోయిన జయసుధకు అభినయ మయూరి అవార్డును ఇస్తూ సత్కరిస్తున్నట్లు చెప్పారు.

Hero Rajasekhar speech at TSR Birthday Celebrations

మురళీ మోహన్ మాట్లాడుతూ..కృష్ణదేవరాయులు సుబ్బరామి రెడ్డి రూపంలో మళ్లీ పుట్టాడా? అనిపిస్తుంది. ఎంతోమంది కళాకారులను, రాజకీయనాయకులను ఒకే వేదికపైకి తీసుకుని రావడం చిన్న విషయం కాదని, అటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సుబ్బిరామిరెడ్డిని అభినందించాల్సిందే అని అన్నారు. శ్రీమతి జయసుధ గారికి సత్కారం చేస్తూ కార్యక్రమం చేయడం ఆనందంగా ఉందని అన్నారు. అక్కినేని నాగేశ్వరరావు గారు జయసుధ గారి ముఖ కవళికలను గమనించేవారని మనం భారీ డైలాగులు చెప్పినా కూడా జయసుధ ఒక్క ఎక్స్ ప్రెషన్ తో డామినేట్ చేస్తుందని అనేవారని చెప్పుకొచ్చారు.

హీరో రాజశేఖర్ మాట్లాడుతూ..మనిషిగా పుట్టడం చాలా గొప్ప విషయం.. మనిషిగా బ్రతకడం ఇంకా చాలా గొప్ప విషయం.. అలా బతకుతున్న వ్యక్తి సుబ్బరామిరెడ్డి గారు అని, మనలో ఉన్న మైనస్ పాయింట్లను వదిలేసి ప్లస్ పాయింట్లను చేర్చుకుంటూ ముందుకు వెళ్లాలని, ఆ విషయాన్ని సుబ్బరామిరెడ్డి అన్న దగ్గర నేర్చుకున్న అని అన్నారు. ఇటువంటి కలయిక చేయడం ఆయనకే సాధ్యం అయ్యిందని రాజశేఖర్ అన్నారు. టీటీడీ ఛైర్మన్ పోస్ట్ చాలా గొప్పది ఆయన ఈ కార్యక్రమంకి వచ్చారంటే దీనికి ఎంతటి ప్రాముఖ్యత ఉందో అన్నారు. అలాగే మా అసోసియేషన్ ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్ కి సుబ్బరామి రెడ్డి గారు సహకరించాలని రాజశేఖర్ కోరారు. అలాగే జయసుధ గారు చాలా గొప్ప నటి. ఆమెను సన్మానం చేయడానికి వచ్చినందుకు సంతోషంగా ఉందని అన్నారు. సుబ్బరామి రెడ్డి గారి ప్రేమ, మంచితనం వల్లే అందరూ ఇక్కడికి వచ్చారని రాజశేఖర్ అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X