మరణం చివరి అంచు వరకు నాన్న, నేను.. ఆ స్థితిని బయటపడటం మిరాకిల్.. రాజశేఖర్ కూతురు శివానీ ఎమోషనల్

టాలీవుడ్ యాంగ్రీ మ్యాన్ డాక్టర్ రాజశేఖర్ కరోనావైరస్ బారిన పడి మృత్యువు అంచుకు వెళ్లి తిరిగి వచ్చారు. కరోనావైరస్ పాజిటివ్‌ కారణంగా రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి ఓ దశలో విషమంగా మారింది. అయితే వైద్యుల నిరంతర పర్యవేక్షణతో ఆయన తిరిగి మామూలు మనిషిగా తిరిగి వచ్చారు. రాజశేఖర్‌కు కరోనా తన వల్లే వచ్చిందంటూ కూతురు శివానీ షాకింగ్ విషయాలు వెల్లడించారు. శివాని చెప్పిన ప్రకారం...

నాన్నకు కరోనావైరస్ సోకడానికి కారణం

నాన్నకు కరోనావైరస్ సోకడానికి కారణం

మా నాన్న రాజశేఖర్‌కు కరోనావైరస్ సోకడానికి ప్రధాన కారణం నేను. నా వల్లే కరోనావైరస్ సోకింది. కోవిడ్ సమయంలో నా పేరెంట్స్ ఇంట్లోనే ఉంటే.. నేను బయట తిరిగాను. ఆ సమయంలో నాకు తలనొప్పి, కాస్త జ్వరంగా ఉండేది. ఆ తర్వాత మూడు రోజులకు తగ్గింది. కాని ఎలాగో నా తండ్రికి కరోనావైరస్ సోకింది అని శివానీ ఎమోషనల్ అయ్యారు.

 నా వల్లే నాన్న ఆరోగ్యం దారుణంగా

నా వల్లే నాన్న ఆరోగ్యం దారుణంగా

నా ద్వారా సోకిన కరోనావైరస్ కారణంగా నాన్న ఆరోగ్యం దారుణంగా క్షీణించింది. సాధారణంగా నేను ఎక్కువగా ఎమోషనల్‌గా కాను. కానీ నాన్నను ఆ పరిస్థితుల్లో చూడగానే ఒకరకమైన భావోద్వేగానికి గురయ్యాను. నా వల్లనే నాన్నకు ఈ దుస్థితి వచ్చిందనే బాధకు లోనయ్యాను. అందుకు నన్ను నేనే నిందించుకొన్నాను అని శివానీ తెలిపారు.

నా కారణంగా నాన్నకు దుస్థితి అని

నా కారణంగా నాన్నకు దుస్థితి అని


నా నిర్లక్ష్యం కారణంగానే నాన్నకు ఇలాంటి పరిస్థితి ఎదురైందనే బాధ చాలా రోజులు నన్ను వెంటాడింది. నాన్నకు చికిత్స జరుగుతున్న సమయంలోనే నాకు సుప్రావెంట్రిక్యూలర్ టకీకార్డియా (ఎస్‌వీటీ) అనే గుండె సంబంధింత వ్యాధికి లోనయ్యాను. నాకు అలాంటి వ్యాధి నా 15వ ఏట నుంచే ఉంది. నాన్నకు అలా జరిగిందనే విషయం నన్ను కుంగదీయడం నా గుండెపై ప్రభావం చూపింది అని శివానీ తెలియజేసింది.

హృదయ సంబంధిత వ్యాధితో

హృదయ సంబంధిత వ్యాధితో

ఒకే సమయంలో ఓ పక్క నాన్నకు కరోనావైరస్ చికిత్స, మరో పక్క నేను గుండె సంబంధిత జబ్బుతో హాస్పిటల్‌లో చేరడంతో మా కుటుంబం తీవ్ర మనోవేదనకు గురైంది. ఆ సమయంలో మాకు, మా కుటుంబానికి అగ్ని పరీక్షగా మారింది. దేవుడి దయవల్ల నాన్న, నేను క్షేమంగా తిరిగి వచ్చాం. తీవ్రమైన ఆరోగ్య పరిస్థితి నుంచి బయటపడటం అద్భుతంగా భావిస్తాం అని శివానీ పేర్కొన్నారు.

Recommended Video

Rajasekhar teams up with ‘Gatham’ makers
జీవితంలో గొప్ప గుణపాఠం అది..

జీవితంలో గొప్ప గుణపాఠం అది..

గడచిన కొన్ని నెలల్లో నేను చాలా జీవిత సత్యాలు, గుణపాఠాలు చేర్చుకొన్నాను. రానున్న రోజుల్లో మంచి లైఫ్, కెరీర్ కోసం ఎదురు చూస్తున్నాను. జీవితంలో ఏ విషయాన్ని కూడా నిర్లక్ష్యం చేయవద్దనే పాఠాన్ని నేర్చుకొన్నాను. ఇలాంటి కరోనా విపత్కర పరిస్థితుల్లో అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాను అని శివానీ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X