హీరో రాజశేఖర్ ప్లాస్మా చికిత్స.. ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల బులెటిన్ రిలీజ్

కరోనావైరస్ పాజిటివ్ బారిన పడిన హీరో రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి మెరుగు పడుతున్నట్టు సిటీ న్యూరో సెంటర్ వైద్యులు మంగళవారం బులెటిన్ రిలీజ్ చేశారు. ఆయన చికిత్సకు స్పందిస్తున్నారు. గతంలో కంటే ఇప్పుడు ఆరోగ్య పరిస్థితి మరింత మెరుగు పడిందని తాజా బులెటిన్‌లో పేర్కొన్నారు.

ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స

ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స

తాజా బులెటిన్ ప్రకారం డాక్టర్ వీ రాజశేఖర్ తీవ్రమైన పరిస్థితుల్లో కోవిడ్ 19 పాజిటివ్‌తో సిటీ న్యూరో సెంటర్‌లో చేరారు. ఆయనకు ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స జరుగుతున్నది. నాన్ ఇన్‌వాసివ్ వెంటిలేటర్ సపోర్ట్‌ను తొలగించాం. చికిత్సలో భాగంగా ఆయనకు ప్లాస్మా థెరపీత, సైటోసోర్బ్ డివైస్ థెరపీని అందించాం అని వైద్యులు తమ బులెటిన్‌లో వెల్లడించారు.

చికిత్సకు స్పందిస్తున్నారు

చికిత్సకు స్పందిస్తున్నారు

ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత మెరుగుపడింది. చికిత్సకు స్పందిస్తున్నారు. వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు చికిత్స జరుగుతున్నది అని సినీ న్యూరో సెంటర్‌కు చెందిన మెడికల్ డైరెక్టర్ డాక్టర్ రత్న కిషోర్ తెలిపారు. త్వరలోనే ఆయన కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తారని పేర్కొన్నారు.

తన కుటుంబ సభ్యులకు కరోనా అంటూ రాజశేఖర్ ట్వీట్

తన కుటుంబ సభ్యులకు కరోనా అంటూ రాజశేఖర్ ట్వీట్

కొద్ది రోజుల క్రితం తాను, తన కుటుంబ సభ్యుందరికి కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం హాస్పిటల్‌లో చేరి చికిత్స పొందుతున్నాం. పిల్లల పరిస్థితి బాగుంది. నేను జీవిత ఇంకా చికిత్స పొందుతూనే ఉన్నాం అని రాజశేఖర్ పేర్కొన్నారు. దాంతో సినీ ప్రముఖులు, అభిమానులు ఆయన సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రార్థించారు.

Recommended Video

Netizen Fires On Hero Rajasekhar & Hyderabad Police, Rajasekhar Replies To Her Post || Filmibeat
మెగాస్టార్ చిరంజీవి ట్వీట్‌తో పరామర్శ

మెగాస్టార్ చిరంజీవి ట్వీట్‌తో పరామర్శ

అయితే హీరో రాజశేఖర్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ తన కుమార్తె శివాత్మిక రాజశేఖర్ ట్వీట్ చేయడం అభిమానులను, సినీ ప్రముఖులను షాక్‌కు గురిచేసింది. ఆ తర్వాత తన తండ్రి ఆరోగ్యం బాగానే ఉంది. త్వరగా బయటకు రావాలని మీరు ప్రార్థన చేయండి అని శివాత్మిక మరో ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా, మెగాస్టార్ చిరంజీవి తన స్నేహితుడు రాజశేఖర్ త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు. స్వయంగా వైద్యులతో మాట్లాడి తగిన చొరవ తీసుకొన్నారనే వార్తలు మీడియాలో వచ్చాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X