Don't Miss!
- News రూ.100 తో ఊరు వదిలాడు.. రూ.200 కోట్లకు అధిపతి
- Sports RCB Playing XI: అతనికి నిరాశే.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడే ఆర్సీబీ తుది జట్టు ఇదే!
- Lifestyle పురుషుల్లో ఈ లక్షణాలు ఉంటే.. ఖచ్చితంగా డిప్రెషన్‌కు గురైనట్టే..!
- Automobiles కారులో ఎక్కువ సౌండ్‌తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
శ్రీదేవిని పెళ్లి చేసుకోమని ప్రపోజల్.. అందుకే రిజెక్ట్ చేశా.. రాజశేఖర్
గ్లామర్ క్వీన్ శ్రీదేవి శనివారం రాత్రి గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. దుబాయ్‌లో ఓ పెళ్లి వేడుకకు హాజరైన శ్రీదేవి అక్కడే తుదిశ్వాస విడిచారు. శ్రీదేవి మృతిపై అభిమానులు, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. శ్రీదేవి కుటుంబంతో తన కుటుంబానికి ఉన్న సాన్నిహిత్యాన్ని రాజశేఖర్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. రాజశేఖర్ చెప్పినదేమిటంటే..
Recommended Video
దూరపు బంధువులు
శ్రీదేవి తండ్రి అయ్యప్పన్, తన తండ్రి స్నేహితులు. శ్రీదేవి కుటుంబం తమకు దూరపు బంధువులు అవుతారు. శ్రీదేవి అమ్మగారికి నేనంటే బాగా ఇష్టం. ఈ నేపథ్యంలో శ్రీదేవిని పెళ్లి చేసుకోమని వాళ్ల ఇంటి నుంచి నాకు ప్రపోజల్ వచ్చింది అని రాజశేఖర్ చెప్పారు.
శ్రీదేవి కుటుంబంతో
మా నాన్న పోలీస్ ఆఫీసర్‌గా, శ్రీదేవి వాళ్ల నాన్న అడ్వొకేట్‌గా ఒకేచోట పనిచేశారు. దాంతో మా కుటుంబాల మధ్య మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. అయితే శ్రీదేవి అప్పటికే సినిమాల్లో నటిస్తుండటంతో మా అమ్మ వద్దని చెప్పింది. నాకు పై చదువులు చదువుకోవాలని చెప్పి ఇప్పుడే పెళ్లి వద్దని చెప్పాను అని అన్నారు.
అందుకే రిజెక్ట్
నేను సినిమాల్లోకి రావడం, సినిమావాళ్లను పెళ్లి చేసుకోవడం మా ఇంట్లో వాళ్లకు ఇష్టం లేదు. అందుకే శ్రీదేవితోపాటు ఆమె సోదరి శ్రీలత సంబంధాన్ని కూడా మా కుటుంబం రిజెక్ట్ చేసింది అని రాజశేఖర్ చెప్పారు.
రాజశేఖర్‌కు షాక్
శ్రీదేవి ఆకస్మిక మృతిపై సోషల్ మీడియాలో పలువురు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్ శ్రీదేవి మరణవార్త విని షాక్ అయ్యారు. ఆమె ఇకలేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. శ్రీదేవి కుటుంబానికి రాజశేఖర్ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
జీవితతో వివాహం
సినిమా నేపథ్యం ఉన్న అమ్మాయిని చేసుకోవద్దనే రాజశేఖర్ కుటుంబం భావించినప్పటికీ.. ఆయన హీరోయిన్ జీవితను ప్రేమించి పెళ్లి చేసుకొన్నారు. అంకుశం సినిమా షూటింగ్లో ఏర్పడిన పరిచయం జీవిత, రాజశేఖర్‌ను ఒక్కటిగా చేసిన సంగతి తెలిసిందే.