రామ్ చరణ్, ఎన్టీఆర్ రూటులోనే రామ్ కూడా
స్టైల్స్, ఏక్టింగ్ లలో పవన్ కళ్యాణ్ ని అనుకరించే రామ్ తాజాగా కెరీర్ ని ఎన్టీఆర్,రామ్ చరణ్ ల రూట్లో నడపాలనుకుంటున్నారు. ఒకేసారి బృందావనం,శక్తి చిత్రాలు చేస్తూన్న ఎన్టీఆర్, మెరుపు,ఆరెంజ్ లలో బిజీగా ఉన్న రామ్ చరణ్ ల దారిలో రామ్ వెళ్ళాలనుకుంటున్నారు. అంతేగాక నాగచైతన్య కూడా ఓ ప్రక్క అజయ్ భుయాన్, సుకుమార్ లతో ఒకేసారి సినిమా చేయటం కూడా నచ్చిందంటున్నాడు. అందుకు తగ్గట్లుగానే రామ్..ఓ ప్రక్క కరుణాకరన్ చిత్రం ఓకే చేసి మరో పక్క నల్లమలుపు బుజ్జి నిర్మాతగా విక్కి అనే దర్శకుడుని పరిచయం చేస్తూ చేయబోయే చిత్రాన్ని కమిట్ అయ్యారు. రెండు చిత్రాలు ఒకే సారి పూర్తి చేస్తే ఏది ఎలా వచ్చినా ఒక్క హిట్టయినా చేతిలో ఉంటుందని రామ్ ఆలోచన అంటున్నారు. వరసగా మస్కా, గణేష్, రామ రామ కృష్ణ కృష్ణ ప్లాఫ్ అవటం, సురేంద్ర రెడ్డితో అనుకున్న రామ్ అండ్ జెన్నీ ప్రాజెక్టు ఆగిపోవటంతో ఈ నిర్ణయం తీసుకున్నాడని చెప్తున్నారు.


Click it and Unblock the Notifications











