హీరో గిఫ్ట్ ఇచ్చాడు కదా అని.. 'నక్క పేడ' కూడా తాగేస్తున్న పూరి జగన్నాథ్!

Recommended Video

Puri Jagannadh Drinking World's Expensive Kopi Luwak coffee | నక్క పెంట తో చేసిన కాఫీ తాగుతున్న పూరి

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ చాలా రోజులుగా పరాజయాలతో సతమతమవుతున్నాడు. ఇటీవల పూరి జగన్నాథ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో ఇస్మార్ట్ శంకర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. రామ్, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న తొలి చిత్రం ఇది. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా పూరి జగన్నాథ్ ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టాడు. నా హీరో రామ్ నాకు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాఫీ గిఫ్ట్ గా ఇచ్చాడు. దీని గురించి గూగుల్ లో తెలుసుకోండి. పిచ్చెక్కిపోతారు అంటూ ట్వీట్ చేశాడు.

ఎలా తయారవుతుందో తెలుసా

ఎలా తయారవుతుందో తెలుసా

సాధారణంగా కాఫీ గింజల క్వాలిటీ, కంపెనీ బ్రాండ్ ని బట్టి, కాఫీ రుచిని బట్టి కాఫీ పొడి తయారు చేసే సంస్థలకు మంచి గుర్తింపు లభిస్తూఉంటుంది. కానీ హీరో రామ్ పూరిజగన్నాథ్ కు గిఫ్ట్ గా ఇచ్చిన కాఫీ గురించి తెలిస్తే విదేశాల్లో ఈ కాఫీఎందుకు ఇంతలా గుర్తింపు తెచ్చుకుందో అర్థం అవుతుంది. రామ్ పూరికి కోపి లువాక్ కాఫీ పొడిని గిఫ్ట్ గా ఇచ్చాడు. ఈ కాఫీ పొడిని నక్కల నుంచి తయారు చేస్తారు. అక్కడితోనే అవాక్కైపోకండి.. ఇంకా చాలా విషయం ఉంది.

నక్క పేడతో

విదేశాల్లో కొన్ని ప్రత్యేకమైన నక్క జాతులు అడవుల్లో సంచరిస్తుంటాయి. వాటిలో కొన్ని కాఫీ చెట్లని తిని బ్రతుకుతుంటాయి. ఆ నక్క కడుపులో కాఫీ గింజలు మాత్రం అరగవు. కాఫీ గింజల్ని నక్క పేడ రూపంలో విసర్జిస్తుంది. ఈ పేడని సేకరించి అందులోని గింజలతో కాఫీ పొడి తయారు చేస్తారు. నక్క కడుపులోని రసాయనాల వలన ఈ గింజలకు ప్రత్యేకమైన రుచి వస్తుంది. సాధారణ గింజలకంటే నక్క పేడతో తయారు చేసిన కాఫీ రుచిగా ఉండడంతో విదేశాల్లో దీనికి మంచి డిమాండ్ ఏర్పడింది.

ఖరీదైన కాఫీ

ఖరీదైన కాఫీ

ఈ కాఫీ పొడి భారత కరెన్సీలో కేజీ 60 వేలు వరకు ఉంటుంది. అందుకే దీనిని ప్రపంచంలోనే ఖరీదైన కాఫీ అని అంటున్నారు. ఇప్పుడిప్పుడే ఈ రకం కాఫీ పొడి కేరళలో కూడా దిగుమతి అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ కాఫీకి డిమాండ్ పెరుగుతుండడంతో నక్కలని ప్రత్యేకంగా పెంచుతూ వాటికీ కాఫీ చెట్లని ఆహారంగా వేస్తున్నారు. ఇలా కోపి లువక్ కాఫీ పొడి ఉత్పత్తి బాగా పెరుగుతోంది. పూరిజగన్నాథ్ తాగుతున్న ఈ కాఫీపై సోషల్ మీడియాలో జోకులు, సెటైర్లు పేలుతున్నాయి.

విజయం కోసం

విజయం కోసం

ఇక సినిమాల విషయానికి వస్తే పూరి తన సొంత నిర్మాణంలో హీరో రామ్ తో ఇస్మార్ట్ శంకర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రామ్ ఈ చిత్రంలో రఫ్ లుక్ లో దర్శనమిస్తున్నాడు. టైటిల్ కూడా ఇస్మార్ట్ శంకర్ అంటూ విభిన్నంగా ఉండడంతో పూరి మార్క్ కనిపిస్తోందని అంటున్నారు. విజయాల కోసం ఎదురు చూస్తున రామ్, పూరికి ఈ చిత్రమైనా హిట్ అందిస్తుందో లేదో చూడాలి .

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X