»   » ఈ సారి కూడా అనుపమేనా..రామ్ కి దిల్ రాజే దిక్కు..!

ఈ సారి కూడా అనుపమేనా..రామ్ కి దిల్ రాజే దిక్కు..!

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  మలయాళీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ హవా సౌత్ లో కొనసాగుతోంది. ప్రేమమ్ చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించిన అనుపమ మంచి అవకాశాలని అందుకుంటోంది. టాలీవుడ్ హీరో రామ్ సరనస రెండవ సారి నటించే అవకాశాన్ని ఈ భామ దక్కించుకుంది. రామ్ తన కొత్త చిత్రాన్ని ప్రారంభించడానికి రెడీ అవుతున్నాడు. త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో రామ్ కొత్త చిత్రం రూపుదిద్దుకోబోతోంది.

  ఎలాగైనా అది నేర్చేసుకుంటుందట.. మలయాళం ముద్దుగుమ్మ Anupama Parameswaran Learning Telugu
  మరోమారు మారు అనుపమతో రొమాన్స్

  మరోమారు మారు అనుపమతో రొమాన్స్

  రామ్ చివరగా నటించిన చిత్రం ఉన్నది ఒక్కటే జిందగీ. ఈ చిత్రంలో రామ్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. మహాగా అనుపమ తన నటనతో అదుర్స్ అనిపించింది. రామ్, అనుపమ మధ్య ఈ చిత్రంలో కెమిస్ట్రీ అద్భుతంగా పండిందని చెప్పొచ్చు. మరోమారు రామ సరేనా అనుపమ నటించే అవకాశాన్ని దక్కించుకుంది.

  దిల్ రాజే దిక్కు

  దిల్ రాజే దిక్కు

  వరుస పరాజయాలతో సతమతమవుతున్న రామ్ కు దిల్ రాజు నిర్మాణంలో నటించే అవకాశం రావడం ఒకింత అతడికి ఊరటనిచ్చే అంశం. ఎందుకంటే దిల్ రాజు వరుస విజయాలతో దూసుకుని పోతున్నారు. అయన బ్యానర్ నుంచి సినిమా వస్తుందంటే మినిమం గ్యారెంటీ హిట్ అనే నమ్మకం ఆడియన్స్ లో ఏర్పడింది. దర్శకుడు త్రినాధరావు, దిల్ రాజు కాంబినేషన్లో సక్సెస్ ఫుల్ మూవీ నేను లోకల్ వచ్చిన సంగతి తెలిసిందే.

  నిరాశ పరిచిన ఉన్నది ఒక్కటే జిందగీ

  నిరాశ పరిచిన ఉన్నది ఒక్కటే జిందగీ


  రామ్ భారీ ఆశలు పెట్టుకుని చేసిన చిత్రం ఉన్నది ఒక్కటే జిందగీ. తనకు గతంలో నేను శైలజ రూపంలో హిట్ ఇచ్చిన కిషోర్ తిరుమల తో రామ్ చేసిన మరో చిత్రం ఇది. రామ్, అనుపమ జంటకు ఈ చిత్రంలో మంచి మార్కులు పడ్డా కమర్షియల్ గా విజయం సాధించలేక పోయింది.

  యువతలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది..కానీ

  యువతలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది..కానీ

  రామ్ కు యూత్ లో ప్రత్యేమైన గుర్తింపు ఉంది. ఆయన బాడీ లాంగ్వేజ్, స్టైల్ ని ఇష్టపడే వారు ఉన్నారు. కానీ సక్సెస్ రేట్ సరిగా లేకపోవడంతో రామ్ కు మార్క్ బాగా దెబ్బ తింది.

  యువతకు నచ్చే కథ తోనే..!

  యువతకు నచ్చే కథ తోనే..!

  మరో మారు యువతని టార్గెట్ చేసే కథతోనే రామ్ రాబోతున్నాడు. యూత్ ఫుల్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపుదిద్దుకోబోతోంది. ఈ నెల 16 న చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. రామ్ కి ఇది 16 వ చిత్రం.

  English summary
  Hero Ram new movie will starts from this month. Anupama parameswaran is the female lead. Trinadha Rao Nakkina is the director. Star producer Dil Raju will produce this movie.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more