Skanda Twitter Review: బాలయ్య అఖండ రేంజ్‌లో రామ్ స్కంద.. అదొక్కటే మైనస్!
ఉస్తాద్ హీరో రామ్ పోతినేని, బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కిన చిత్రం స్కంద ది అటాకర్. ఇక ఈ మూవీ ఈరోజున అంటే సెప్టెంబర్ 28న వరల్డ్ వైడ్ గా థియేటర్లలోకి వచ్చేసింది. ఇక ఈ సినిమా రామ్ కెరియర్ లో తొలి పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కింది. ఇక ఇప్పటికే థియేటర్లకు వచ్చిన ఈ మూవీని చూసిన ప్రేక్షకులు.. ట్విట్టర్ వేదికగా రివ్యూలు పెడుతున్నారు. అసలు రామ్ హిట్ కొట్టాడా... ప్రేక్షకులను మెప్పించాడా... రామ్ తొలి పాన్ ఇండియా మూవీ సక్సెసా అనే వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా నటించిన చిత్రం స్కంద. ఈ మూవీలో హీరోయిన్ గా శ్రీలీల నటించింది. ఇక ఈ సినిమాకు థమన్ సంగీతం అందించారు. ప్రపంచవ్యాప్తంగా స్కంద సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా ప్రిమియర్స్ పడ్డాయి. మాస్ యాక్షన్ హీరోగా రామ్ పోతేనేని కనిపించాడు. సినిమా చూసిన ప్రేక్షకులు స్కంద మూవీ రివ్యూ ఇస్తున్నారు. సినిమా ఎలా ఉందొ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.

ఇక స్కంద మూవీ ట్రైలర్, టీజర్ చూసినప్పుడు.. ప్యూర్ మాస్ యాక్షన్ మూవీలానే అనిపించింది. ఇక బోయపాటి అన్ని సినిమాలను కలిపి ఈ సినిమా తీశారనే కామెంట్స్ వచ్చాయి. రామ్ హెవీ డైలాగ్స్, భారీ యాక్షన్.. రామ్ ఫ్యాన్స్ కు బాగానే అనిపించినా.. ట్రైలర్స్ పై మాత్రం ట్రోలింగ్ వచ్చింది. అయితే ఇప్పుడు ఈ సినిమా థియేటర్లలో సందడి చేస్తుంది. ప్రేక్షకులు తమ అభిప్రాయాల్ని ట్విట్టర్ వేదికగా చెబుతున్నారు.

స్కంద ఫస్ట్ ఆఫ్ రిపోర్ట్ చూస్తే... రామ్ పోతినేని బుల్ ఇంట్రడక్షన్ ఆక్టటుకుంటోంది. ఇక శ్రీలీల సీన్స్ కూడా బాగున్నాయి. యాక్షన్ సీన్స్ నెక్ట్ లెవెల్. ఇక ఎప్పటిలాగానే తమన్ మ్యూజిక్, బీజీఎమ్ అదిరిపోయింది. ఇంటర్వెల్ కు వచ్చేసరికి సినిమా నెక్ట్ లెవెల్ స్థాయికి వెళ్తుంది అని చెబుతున్నారు. మొత్తానికి ఫస్ట్ ఆఫ్ సూపర్ హిట్ గా నిలిచిందని తెలుస్తోంది.
ఇక ట్విట్టర్ ఓ వ్యక్తి స్కంద ఫస్ట్ ఆఫ్ ఇప్పుడే ముగిసింది.. రామ్ ను ఎప్పుడు చూడని అవతార్ లో కనిపించారు.. బోయపాటి శ్రీను మాస్ ఫైర్ అంటూ రాసుకువచ్చారు. అంటే ఈ సినిమా ఫస్ట్ ఆఫ్ ముగిసింది. ఇది ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని తెలుస్తోంది.
ఇక మరో రివ్యూ చూస్తే... ఫస్ట్ ఆఫ్ లో రెండు భారీ మాస్ బ్లాక్స్ తో బోయపాటి మాస్ యాక్షన్ ఉందని తెలుస్తోంది. ఇక థమన్ అందించిన మ్యూజిక్ అల్టిమేట్. ఇంటర్వెల్ సీన్ అదిరిపోయిందని పెడుతున్నారు. ఇక ఈ సినిమా బాలయ్య అఖండ రేంజులో ఉందని కామెంట్స్ వస్తున్నాయి. అయితే ఇంత వైలెంట్ కొంత మందికి నచ్చడం లేదు. అదొక్కటే కొంత వరకు ఈ సినిమాకు మైనస్ అయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











