Skanda మూవీకి సీక్వెల్ అనౌన్స్... బోయ మావా ప్లానింగ్ మామూలుగా లేదు.. ఈసారి ఇంటర్నెషనల్ లెవెల్!
ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం స్కంద. ఇక ఈ మూవీ ఈరోజున గ్రాండ్ గా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా లెవెల్ లో థియేటర్లోకి వచ్చేసింది. ఇక మొదటి షో నుంచి ఈ సినిమా ప్యూర్ మాస్ ఎంటర్ టైనర్ గా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ మూవీ క్లైమాక్స్ లో స్కంద 2 అనౌన్స్ చేశారు. అసలు ఈ స్టోరీ ఏంటీ.. సీక్వెల్ ఎందుకు పెట్టారు అనే విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
రామ్, శ్రీలీల జంటగా నటించిన చిత్రం స్కంద. ఇక ఈ మూవీకి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. సెప్టెంబర్ 28న తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రామ్ కెరియర్ లోనే తొలి పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయింది. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఇక ఈ సినిమాకు థమన్ సంగీతం అందించారు.

హీరో రామ్ కెరియర్ లో స్కంద మూవీ పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కింది. ఇక ఎన్నో అంచనాల నడుమ ఈరోజున థియేటర్లోకి వచ్చి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఇక ఈ మూవీలో యాక్షన్ సీన్స్ ఎక్కువగా ఉన్నట్లు ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. బోయపాటి సినిమా అంటే.. మినిమం రక్తపాతం, యాక్షన్స్ సీన్స్... కొడితే ఒకే సారి పది మంది ఎగిరి పడటం ఉంటాయి. ఇక ఈ సినిమాలోనూ అలాగే చూపించారని టాక్ వినిపిస్తుంది.
ఇక ఈ సినిమాకు స్కంద అనే టైటిల్ ఎందుకు పెట్టారో తెలియదు. ఆ పేరుతో ఈ సినిమాకు ఎలాంటి సంబంధం లేదని తెలుస్తోంది. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే... ఈ సినిమాలో రామ్ పేరును సైతం రివిల్ చేయలేదు. గతంలో పేర్లను రివిల్ చేయకుండా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా వచ్చింది. ఇందులో హీరోల పేర్లు చెప్పలేదు దర్శకుడు. ఇప్పుడు బోయపాటి కూడా ఈ సినిమాలో రామ్ పేరును ఎక్కడా చెప్పలేదు.

ఇక వీకిపిడియాలో మాత్రం భాస్కర్ రుద్రగంటి అనే పేరుంది. అయితే ఈ పేరు కరెక్ట్ కాదని తెలుస్తోంది. ఎందుకంటే.. ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన శ్రీకాంత్ పేరు రుద్రకంటి రమేశ్. మరి ఆయన రామ్ ను మావయ్య అని పిలుస్తాడు. ఒకే ఇంటిపేరుతో ఉండాలంటే.. బాబాయి, లేదా తండ్రి అయి ఉండాలి. కాబట్టి అది తప్పుడు సమాచారం అని తెలుస్తోంది.
ఇక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. ఈ సినిమాకు క్లైమాక్స్ లో సీక్వెల్ అనౌన్స్ చేశారు. ఇక ఈ సినిమా సీక్వెల్ ఇంటర్ నేషనల్ లెవెల్ ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాలో రామ్ తో పాటు మరో రామ్ కూడా ఉంటారు. ఇది కూడా చివరనే రివిల్ చేశారు. ఇక స్కంద పార్ట్ 2 లో ఇంకో రామ్ గురించి ఉంటుందట. మరి బోయ మావా మామూలుగా లేదని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











