రామ్ పద్దతి నచ్చకే ఆ స్టార్ డైరక్టర్
కందిరీగ కిక్కుతో ఊగిపోతున్న రామ్ ని ఎప్రోచ్ అయిన ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ కి దాదాపు పరాభవం జరిగినంత పనైంది అంటున్నారు.వివరాల్లోకి వెళ్ళితే రామ్ హీరోగా కందిరీగ కు ముందే స్టోరీ లైన్ వినిపించి ఓకే చేసుకున్నారు గౌతమ్ మీనన్.అయితే ఇప్పుడు ఇక సెట్స్ కు వెళ్ళబోయే స్టేజిలో రామ్ తన పైత్యాన్ని అంతా అందులో గుమ్మరించే ప్రయత్నం చేస్తున్నాడంటున్నారు.తనకు కావాల్సినట్లు చెయ్యబట్టే కందిరిగ హిట్టైందని అతను భావించి ఇలా స్క్ర్రిప్టులో వేలు పెట్టే ప్రయత్నం చేసాడు.గౌతమ్ మీనన్ అప్పటికీ తను కథ మీద ఆధారపడనని,కధనం,సీన్స్ కన్సీవింగ్,విజువల్స్ మీద ఆధారపడతానని ఎంత చెప్పినా వినిపించుకోకుండా తన మానాన తాను కరెక్షన్స్ చెప్పుకుంటూ పోయాట్ట.దాంతో గౌతమ్ మీనన్ కి ఒళ్ళు మండింది.మరో ప్రక్క తమ ప్రాజెక్టు ఓకే చేసుకున్న బెల్లంకొండ సురేష్ తో రామ్ కి సంభంధాలు తెగిపోయాయి.ఈ నేపధ్యంలో గౌతమ్ మీనన్ వేరే నిర్మాత వచ్చినా రామ్ తో చేయాలా వద్దా అని ఆలోచనలో పడ్డాడని చెన్నై సర్కిల్స్ లో వినపడుతున్న వార్త.


Click it and Unblock the Notifications











