శ్రీను వైట్ల సినిమానే హీరో రామ్ ని చెడగొట్టిందా?
దేవదాసు చిత్రంతో పరిచమైన రామ్ ఆ తర్వాత హిట్టు..ప్లాపులతో సంభందం లేకుండా సినిమాలు చేస్తున్నాడు. అందులోనూ స్రవంతి బ్యానర్ తమదే అవటంతో నిర్మాతల సమస్య లేకుండా పోయింది. ఇక విషయానికి వస్తే..రామ్ కి ఈ మధ్య తమిళంలో నయనతార, ఆర్య కాంబినేషన్ లో రూపొందిన బాస్ ఎన్ గిర భాస్కర్ చిత్రాన్ని చూపించి నీతో రీమేక్ చెయ్యాలని ఉందని చెప్పారట. అయితే సినిమాలో సెకెండ్ హీరో క్యారెక్టర్ కీ కూడా ప్రయారిటీ ఉంది నేను సోలో హీరో అయితేనే చేస్తాను అన్నాట్ట. అది కాదు బాబు...కథ నచ్చితే కొద్దిగా స్క్రిప్టు మారుద్దాం అంటే లేదు..సెకెండ్ హీరో అనే మ్యాటర్ పై సెకెండ్ ధాట్ లేదని ఖచ్చితంగా చెప్పాడట. అప్పుడు వాళ్లు అర్జెంటుగా దాన్ని నేనే అంబాని..ఆరు నెలల్లో అనే టైటిల్ పెట్టి డబ్బింగ్ ప్రారంభించారు. ఇక ఈ విషయం గురించి ఆ నిర్మాత మంచి కథ, కరెక్టుగా రామ్ అయితే సరిపోతాడనుకున్నాం...అప్పుడే అతను మెగా హీరోలా ఫీలవుతూ మాట్లాడటం మేం ఊహించలేకపోయాం అని భాధపడుతూ చెప్పాట్ట. ఇక రామ్..సురేంద్రరెడ్డి దర్శకత్వంలో చిత్రం కూడా రిజెక్టు చేసారు..స్క్రిప్టులో ప్లాబ్లం చూపెట్టి అన్న విషయం తెలిసిందే. ఇక ఈ యాటిట్యూడ్ రావటానికి కారణం...రెడీ చిత్రం మంచి విజయం సాధించటమే అని తేల్చారు.


Click it and Unblock the Notifications











