ఇంకా ఈ పరువు హత్యలు ఏందిరా.. జంగిల్ ఫెలోస్.. ఒక రేంజ్‌లో ఫైర్ అయిన హీరో రామ్!
Recommended Video

మిర్యాలగూడకు చెందిన ప్రణయ్, అమృత ప్రేమ విషాదాంత ఘటన అందరిని కలచివేస్తోంది. సినీ రాజకీయ ప్రముఖులు ప్రణయ్ హత్యని ముక్త కంఠంతో ఖండిస్తుంటారు. ఇకనైనా ఇలాంటి ఘటనలు జరగకూడదని భావిస్తున్నారు. కుమార్తె ప్రేమ వివాహం చేసుకుందని ఆమె భర్తని కుటుంబ సభ్యులే హత్య చేయించిన సంఘటన సంచలనంగా మారింది. సినీ తారలు ఒక్కొక్కరుగా ఈ ఘటనపై స్పందిస్తున్నారు.

సెక్షన్ 377 కూడా ఎత్తేశారు
హీరో రామ్ ఈ ఘటనపై తనదైన శైలిలో ఘాటుగా స్పందించాడు. సెక్షన్ 377 కూడా ఎత్తేశారు. ఇంకా కులాలు పట్టుకుని వేలాడడం ఏంటని రామ్ మండిపడ్డాడు. కులాలు, పరువు హత్యలు ఇందిరా ఇది జంగిల్ ఫెలోస్ అంటూ రామ్ తన ట్విట్టర్ లో స్పందించాడు.
మనిషిగా బ్రతకండి
ప్రణయ్, అమృత విషాదాంత ప్రేమ కథపై విచారం వ్యక్తంచేసిన రామ్.. ఇకనైనా మనిషిగా బ్రతకడం నేర్చుకోండి అని సూచించాడు. అశ్రునయనాల మధ్య నిన్న ప్రణయ్ అంత్య క్రియలు జరిగాయి. అమృత తండ్రే ప్రణయ్ ని దారుణంగా హత్య చేయించాడు.

తోకలు కట్ చేయాలి
మరో సినీ సెలెబ్రిటీ, సింగర్ చిన్మయి కూడా ఈ ఘటనపై స్పందించింది. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు మనవంతు ప్రయత్నంగా కులాలు నిర్ములించాలి అని పేర్కొంది. పేర్ల చివర ఉండే తోకలు కట్ చేయాలి అంటూ సోషల్ మీడియాలో భారీ లేఖతో తన అభిప్రాయాలు వెల్లడించింది.

హాలో గురూ ప్రేమ కోసమే
ఇక సినిమా విషయానికి వస్తే రామ్ ప్రస్తుతం హలొ గురు ప్రేమ కోసమే అనే రొమాంటిక్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్ర టీజర్ నేడు సాయంత్రం 5 గంటలకు విడుదల కానుంది. ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 18 న విడుదల కాబోతోంది.


Click it and Unblock the Notifications











