రామ 'రామ్' ఇదేమి సెంటిమెంటు
దేవదాసు చిత్రం ద్వారా పరిచయమైన ఎనర్జిటిక్ హీరో రామ్. తొలి చిత్రంతోనే మంచి ప్రతిభను కనబరిచి, అందరి మన్ననలూ పొందాడు. ఈ చిత్రం తర్వాత రామ్ నటించిన చిత్రాల్లో 'జగడం' మినహా మిగిలిన చిత్రాలు హిట్ అయినవే. తన నటజీవితంలో మైల్ స్టోన్ గా నిలిచిపోయే చిత్రం ఎదంటే తడుముకోకుండా 'దేవదాసు' అని చెప్పవచ్చు. ఈ చిత్రం టైటిల్ ఒకప్పటి పాత సినిమా 'దేవదాసు' టైటిల్ కు రిపీటు. ఇక పోతే తాజాగా రామ్ నటిస్తున్న చిత్రం గణేష్. ఈ చిత్రాన్ని కూడా తన కెరీర్ లో ఓ మైల్ స్టోన్ గా నిలపాలనుకున్నాడో ఏమో, దీనికి కూడా వెంకటేష్ నటించిన 'గణేష్' చిత్రం టైటిల్ నే రిపీట్ చేసాడు. ఉపశీర్షికతో కొంత తేడా వున్నప్పటికీ ఈ చిత్రం ఘనవిజయాన్ని సాధిస్తుందన్న ఆశాభావంతో వున్నాడు.
ఇది విన్న వాళ్లు మాత్రం రామ రామ 'రామ్' ఇదేమి సెంటిమెంటయ్యా అంటున్నారట. కానీ ఇవేవీ పట్టించుకోని రామ్ తన తదుపరి చిత్రం కోసం మరో పాత టైటిల్ రిపీట్ చెయ్యడానికి సన్నద్దమయిపోయాడంట. ఇన్నాళ్లు సున్నా('o') సెంటిమెంటుతో సినిమాలు చేస్తున్న గోపీచంద్ కు తన తాజా చిత్రం 'శంఖం' లో రెండు సున్నాలున్నా సినిమాని నిలబెట్టలేకపోయాయి. కాబట్టి సినిమాలో విషయముండాలే కానీ ఇలాంటి సెంటిమెంట్ల వల్ల సినిమాలు నిలబడవని రామ్ ఎప్పుడు తెలుసుకుంటాడో??


Click it and Unblock the Notifications











