twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మాటలు బాగా చెప్పారు, ఇదీ మీ బుద్ది.. అభినందన్‌ని విడిచిపెట్టాలి అంటూ హీరో రామ్, సిద్దార్థ్!

    |

    పుల్వామా ఘటనకు భారత్ తిరుగులేని ప్రతీకారం తీర్చుకుంది. నేరుగా పాక్ భూభాగంలోకి ప్రవేశించిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మిరాజ్ యుద్ధ విమానాలు జైషే మహమ్మద్ టెర్రర్ ట్రైనింగ్ క్యాంప్ ని నేలమట్టం చేసి వచ్చాయి. దీనిని అంతా సర్జికల్ స్ట్రైక్ 2గా అభివర్ణిస్తున్నారు. ఈ దాడిలో దాదాపు 300 మంది ఉగ్రవాదుల మరణించినట్లు భారత ప్రభుత్వం ధ్రువీకరించింది. ఈ ఘటన తర్వాత పాకిస్థాన్ సరిహద్దులో కవ్వింపు చర్యలకు పాల్పడడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.

     పాక్ చెరలో అభినందన్

    పాక్ చెరలో అభినందన్

    బాలాకోట్ పై బాంబుల వర్షం కురిపించిన ఇండియా జైషే మహమ్మద్ ఉగ్ర స్థావరాలని, 300 మంది ఉగ్రవాదులని మట్టికరిపించింది. ఈ ఘటన తర్వాత పాకిస్థాన్ వైమానిక దళాలు సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడ్డాయి. వాటిని తిప్పికొట్టే ప్రయత్నంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలెట్ అభినందన్ పాక్ ఆర్మీకి చిక్కారు. అభినందన్ గాయాలతో కనిపిస్తున్నా దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పాకిస్థాన్ అదుపులో ఉన్నప్పటికీ అభినందన్ చెక్కు చెదరని ధైర్యంతో కనిపిస్తున్నాడని దేశం మొత్తం ప్రశంసలు కురిపిస్తోంది. బ్రింగ్ అభినందన్ బ్యాక్ అనే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో ట్రెండ్ అవుతోంది.

    మాటలు బాగా చెప్పారు

    అభినందన్ ని వెంటనే విడచిపెట్టాలి అంటూ నెటిజన్లతో పాటు సెలెబ్రిటీలు కూడా గళమెత్తుతున్నారు. టాలీవుడ్ హీరో రామ్ ట్విట్టర్ లో ఈమేరకు స్పందించాడు. శాంతిని కోరుకుంటూ అద్భుతమైన ప్రసంగం చేసారు ఇమ్రాన్ ఖాన్ సర్. శాంతి మంత్రం జపించే మీ చేతుల్లో మా హీరో(అభినందన్)ఉన్నారు. ఆయన పట్ల మీరెలా వ్యవహరిస్తారో ఇండియా మొత్తం చూస్తోంది అని వ్యాఖ్యానించాడు.మా హీరోని వదిలిపెట్టండి అని రామ్ కోరాడు.

    మీ బుద్ది బయటపడింది

    మరో హీరో సిద్దార్థ్ స్పందిస్తూ.. మా సైనికుల్ని టెర్రరిస్టులు చంపేశారు. వారి స్థావరాలని మేము నాశనం చేశాం. మా మనుషులు ఎవరూ చనిపోలేదని పాక్ అంటోంది. కానీ ఉగ్ర స్థావరాలు మా దేశంలో లేవు అని మాత్రం చెప్పడం లేదు. ఇప్పుడు మా పైలెట్ ని అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడే మీ బుద్ది బయటపడుతోంది. పాకిస్థాన్ ఉగ్రవాదానికి మద్దత్తు తెలుపుతోంది. కానీ ఇండియా అలా కాదు. ఈ నిజాన్ని ఎవరూ కాదనలేరు అని సిద్దార్థ్ ట్విట్టర్ లో వ్యాఖ్యానించాడు.

    ఇలాంటిది జరుగుతుందనే

    ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కమాండర్ అభినందన్ క్షేమంగా తిరిగిరావాలని మిగిలిన సెలెబ్రిటీలు కూడా కోరుకుంటున్నారు. ఇలాంటిది జరుగుతుందనే సర్జికల్ స్ట్రైక్ జరిగినప్పుడు సంబరాలు చేసుకోలేదు అని తాప్సి వ్యాఖ్యానించింది. ఇండియన్ కమాండర్ అభినందన్ ధైర్యానికి శభాష్. దేశంలోకి ప్రతి ఒక్క పౌరుడు మీ రాక కోసం ఎదురుచూస్తున్నారు. మీకు మేమంతా అండగా ఉన్నాం అని అనుపమ్ ఖేర్ వ్యాఖ్యానించారు.

    English summary
    Hero Ram, Siddharth and other Celebrities about IAF commander Abhinandan
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X