twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పైరేటెడ్ లింక్ లు వదిలిన హీరో రామ్

    By Srikanya
    |

    హైదరాబాద్ : సినిమాకు పైరసీ అనేది ఈ రోజున ఓ వైరస్ గా మారింది. అయితే తమ సినిమాకు పైరసీ ఆగితే చాలు అన్నట్లు గా ప్రతీ నిర్మాత, దర్శకుడు భావించటంతో శాశ్వత పరిష్కారం దొరకటం లేదు. సినిమా రిలీజైనప్పుడు హడావిడి చేయటం...తర్వాత వేరే వారి సినిమా పైరిసీ అంటే కలిసిగట్టుగా ఉండకపోవటం జరుగుతోంది. ఈ నేపధ్యంలో రిలైజన ప్రతీ పెద్ద సినిమాకూ పైరసీ సమస్య ఎదురౌతోంది.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    తాజాగా రామ్ చిత్రానికి పైరిసీ దెబ్బ తగిలేటట్లు కనపడుతోంది. దాంతో రామ్ ... పైరసీ ని అరికట్టడానికి ఓ తెలివైన స్టెప్ తీసుకున్నాడు. రామ్‌ హీరోగా నటించిన చిత్రం 'పండగ చేస్కో'. రకుల్‌ప్రీత్‌ సింగ్‌, సోనాల్‌ చౌహాన్‌ హీరోయిన్స్. గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహించారు. ఆయన ఓ ట్వీట్ చేసి పైరసీ ని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ట్వీట్ ఏమిటంటే....

    మేం కొన్ని ఫేక్ పైరెటెడ్ లింక్ లు పండుగ చేస్కో చిత్రానివి వదిలాం..అందులో వైరస్ ఉంటుంది...మీరు జాగ్రత్తగా ఉండండి అని... ఆ సారాసం..మీరూ ఆ ట్వీట్ చూడండి...

    రామ్ మాట్లాడుతూ...''ఆరేళ్ల క్రితమే ఓకే చేసిన కథ ఇది. ఈలోగా చాలా సినిమాలొచ్చేశాయి. అందుకే కథ కాస్త రొటీన్‌గా అనిపించొచ్చు. కానీ ప్రతి సన్నివేశం వినోదాత్మకంగా ఉండడంతో ప్రేక్షకులకు బాగా నచ్చింది''అని రామ్‌ తెలిపారు.

    ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్‌ మాట్లాడుతూ ''సమీక్షలతో సంబంధం లేకుండా ఈ సినిమా ముందుకు దూసుకెళ్తోంది. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో ఎన్నో సమస్యల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. వాటన్నింటినీ తట్టుకొని ఈ సినిమా పూర్తి చేశారు. వరుసగా రెండు విజయాలు సాధించడం ఏ దర్శకుడికైనా గొప్ప ఘనతే. గోపీచంద్‌ మలినేని ఈ సినిమాని బాగా తీర్చిదిద్దాడు''అన్నారు.

    గోపీచంద్‌ మలినేని మాట్లాడుతూ ''వినోదం, కుటుంబ ప్రేక్షకులకు నచ్చే అంశాలూ ఈ చిత్రాన్ని నిలబెట్టాయి. నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ మనసు పెట్టి చేసిన సినిమా ఇద''న్నారు.

    Hero Ram Strategy To Curb Piracy

    ''మేం రొటీన్‌ సినిమానే తీశాం. ఎప్పట్లాగే జనాలు చూస్తున్నారు. ప్రేక్షకుల కోసం సినిమాలు తీస్తాంగానీ, సమీక్షల కోసం కాదు'అ'ని రచయిత కోన వెంకట్‌ తెలిపారు. ''ద్వితీయార్ధంలో వచ్చే సన్నివేశాలకు ప్రేక్షకులు పడీ పడీ నవ్వుతున్నారు''అని దిల్‌ రాజు చెప్పారు.

    రకుల్‌ ప్రీత్‌సింగ్‌, సోనాల్‌ చౌహాన్‌, సాయికుమార్‌, సంపత్‌, రావు రమేష్‌, బ్రహ్మానందం, జయప్రకాష్‌రెడ్డి, రఘుబాబు, సుప్రీత్‌, బ్రహ్మాజీ, సుబ్బరాజు, అభిమన్యుసింగ్‌, వెన్నెలకిశోర్‌, ప్రభాస్‌ శ్రీను, ఫిష్‌ వెంకట్‌, తేజస్విని తదితరులు ఇతర పాత్రధారులు. ఈ సినిమాకు కథ; వెలిగొండ శ్రీనివాస్‌, మాటలు: కోన వెంకట్‌, రచన సహకారం: అనిల్‌ రావిపూడి, కెమెరా: ఆర్థర్‌ విల్సన్‌, ఎడిటింగ్‌: గౌతంరాజు, ఆర్ట్‌: ఎ.ఎస్‌.ప్రకాష్‌, ఫైట్స్‌: రామ్‌-లక్ష్మణ్‌, సంగీతం: థమన్‌.ఎస్‌.ఎస్‌., పాటలు: భాస్కరభట్ల, శ్రీమణి, డ్యాన్స్‌: రాజు సుందరం.

    English summary
    Ram tweeted saying, PLS NOTE: We just released some Fake Pirated links of #PandagaChesko online with a VIRUS..Please be aware ppl...Love :)'
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X