చీపురుపట్టిన రామ్, ఆ నలుగురు హీరోయిన్లను..(ఫోటోస్)
హైదరాబాద్: టాలీవుడ్ యంగ్ హీరో, ఎనర్జీ స్టార్ రామ్ స్వచ్ఛ్ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. గురువారం హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడలోని శ్రీనగ్ కాలనీ ప్రభుత్వ పాఠశాలలో జరిగిన స్వచ్చభారత్ కార్యక్రమంలో చీరుపు చేతపట్టారు. స్కూలు ప్రాంగణంలో ఉన్న చెత్తను శుభ్రం చేసారు.
టాలీవుడ్ హీరోయిన్లయిన హన్సిక, తమన్నా, సమంత, రాకుల్ ప్రీత్ సింగ్ లను రామ్ స్వచ్చ్ భారత్ కార్యక్రమానికి నామినేట్ చేసారు. ఈ సందర్భంగా రామ్ మాట్లాడుతూ...ప్రజలంతా సిగరెట్, గుట్కా మానేస్తే వీధులు శుభ్రంగా ఉంటాయని పేర్కొన్నారు. నరేంద్ర మోడీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో నన్ను లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ నామినేట్ చేయడం, తాను స్వయంగా పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు.
తన అభిమానులు కూడా స్వచ్ఛ్ భారత్ కార్యక్రమంలో పాల్గొనాలని ఈ సందర్భంగా రామ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో...

రోడ్లు ఊడుస్తున్న రామ్
హైదరాబాద్ ఎల్లారెడ్డి గూడలో జరిగిన కార్యక్రమంలో రోడ్లు ఊడుస్తున్న రామ్.

చెత్త ఎత్తుతూ...
రోడ్లు ఊడ్చిన అనంతరం రామ్ చెత్తను స్వయంగా తన చేతులతో ఎత్తేసారు.

అభిమానులు
అభిమానులంతా స్వచ్ఛ్ భారత్ కార్యక్రమంలో పాల్గొనాలని రామ్ పిలుపునిచ్చారు.

హీరోయిన్లను
ఈ సందర్భంగా రామ్ హన్సిక, తమన్నా, సమంత, రాకుల్ ప్రీత్ సింగ్ లను నామినేట్ చేసారు.


Click it and Unblock the Notifications











